IPO News: బజాజ్ గ్రూప్ నుంచి ఐపీవో.. ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు డబ్బు సిద్ధం చేస్కోండి..
Bajaj Housing Finance IPO: దేశీయ స్టాక్ మార్కెట్లు సెప్టెంబర్ నెలలో పేపటి నుంచి అడుగుపెట్టనున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లోకి కొత్తగా మరిన్ని ఐపీవోలు అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇది ఐపీవోలపై బెట్టింగ్ వేసే పెట్టుబడిదారులకు మంచి అవకాశాలను తెచ్చిపెడుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐపీవో గురించే. ఇది బజాజ్ గ్రూప్‌కు చెందిన ఒక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. వాస్తవానికి కంపెనీ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం సెప్టెంబర్ 9న తెరవబడుతోంది. బెట్టింగ్ వేసే దరఖాస్తుదారులకు సెప్టెంబర్ 11, 2024 వరకు సమయం ఉంటుంది. అయితే కంపెనీ ఇంకా ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను ప్రకటించలేదు. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో రానున్న శుక్రవారం తెరచుకోనుంది.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ 2008లో స్థాపించబడింది. ఇది బజాజ్ ఫైనాన్స్ కంపెనీకి అనుబంధ సంస్థ. బజాజ్ ఫైనాన్స్‌లో పేరెంట్ కంపెనీ బజాజ్ ఫిన్‌సర్వ్‌కి 51.34 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ 2015 నుంచి నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌గా నమోదు చేయబడింది. కంపెనీ ఇప్పటికీ తన ప్రైస్ బ్యాండ్ ధరను ప్రకటించనప్పటికీ.. గ్రేమార్కెట్లో ఒక్కో షేరుకు రూ.60 ప్రీమియం ధర పలుకుతోంది. కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం రిజర్వు చేసింది. గరిష్టంగా 50 శాతం మాత్రమే అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల కోసం రిజర్వ్ చేయబడుతుంది. మిగిలిన వాటాను 15 శాతం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ రిజర్వు చేసింది.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజా ఐపీవో ద్వారా రూ.6,560 కోట్లను సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో రూ.3,560 కోట్ల విలువైన షేర్లు తాజా ఇష్యూ ఉండగా.. రూ.3,000 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ కింద జారీ చేయనుంది. కంపెనీ 2015 నుంచి నేషనల్ హౌసింగ్ బ్యాంక్(NHB)లో నమోదు చేయబడింది. 2018 ఆర్థిక సంవత్సరం నుంచి తనఖా రుణాలను అందిస్తోంది. మార్చి 31, 2024 నాటికి కంపెనీకి 3,08,693 యాక్టివ్ కస్టమర్‌లు ఉన్నారు. అందులో 81.7% మంది హోమ్ లోన్ కస్టమర్స్ కావటం గమనార్హం. ప్రస్తుతం కంపెనీ 20 రాష్ట్రాలు , 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 215 శాఖల నెట్‌వర్క్ ఉంది.


Click it and Unblock the Notifications