కొనసాగుతున్న Avalon Technologies ఐపీవో.. రెండు రోజులే ఛాన్స్.. కొనొచ్చా..?
IPO News: అవలాన్ టెక్నాలజీస్ తన ఐపీవోను సబ్‌స్క్రిప్షన్ కోసం ఏప్రిల్ 3న ప్రారంభించింది. ఇది ఏప్రిల్ 6 గురువారం ముగియనుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ ఏకంగా రూ.865 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో షేర్ బ్యాండ్ ప్రైస్ ను రూ.415-436గా నిర్ణయించబడింది.
ఐపీవోకి ముందు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.389.25 కోట్లను సమీకరించింది. ఐపీవోలో రూ.320 కోట్లతో 7,339,450 షేర్ల తాజా ఇష్యూతో పాటు రూ. 545 కోట్ల విలువైన 12,500,000 ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS) రూపంలో కంపెనీ తీసుకొస్తోంది. కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో స్టాక్ ఏప్రిల్ 18, 2023న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయని తెలుస్తోంది.

బాక్స్ బిల్డ్ సొల్యూషన్‌లను అందించడంలో కంపెనీ దేశంలోనే ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీగా ఉంది. కంపెనీ అధిక విలువ కలిగిన ఖచ్చితమైన ఇంజనీరింగ్ ఉత్పత్తులపై దృష్టి సారిస్తుంది. కంపెనీ క్లయింట్ సర్వీసింగ్ మోడల్ ద్వారా తమ కస్టమర్లతో సుదీర్ఘ సంబంధాలను కలిగి ఉంది.
నవంబర్ 2022 నాటికి కంపెనీ 80 మంది కస్టమర్ బేస్‌తో రూ. 1190 కోట్ల ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. కంపెనీ అత్యధికంగా అమెరికా నుంచి 63 శాతం ఆదాయాన్ని పొందుతోంది. క్లీన్ టెక్, పవర్ ఆటోమేషన్, మొబిలిటీ వంటి రంగాల్లోని కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. పెరుగుతున్న ఆర్డర్ బుక్, స్థిరమైన మార్జిన్‌కు భరోసా ఇస్తుంది. దీర్ఘకాలికంగా సబ్‌స్క్రైబ్ చేయమని సిఫార్సు చేస్తున్నట్లు కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ సూచించింది. ఇదే క్రమంలో రిలయన్స్ సెక్యూరిటీస్ కూడా ఐపీవోను కొనుగోలు చేయమని సిఫార్సు చేసింది. కంపెనీ మేక్ ఇన్ ఇండియా, పీఎల్ఐ స్కీమ్స్ ద్వారా కూడా ప్రయోజనాన్ని పొందుతున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications