IPO News: చాలా కాలంగా మార్కెట్లలో ఐపీవోల సందడి మెుదలైంది. అది కొనసాగుతూనే ఉంది. రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగు పెట్టేందుకు 5 ఐపీవోలు తెరవబడుతున్నాయి. వాటి వివరాలను పరిశీలిస్తే..
మెుదటగా యథార్త్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ లిమిటెడ్ IPO జూలై 26న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. ఇది పెట్టుబడిదారుల కోసం జూలై 28, 2023 వరకు తెరచి ఉంటుంది. కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.285 నుంచి రూ.300గా నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ షేర్ గ్రేమార్కెట్ ప్రీమియం ధర రూ.78 వద్ద ట్రేడవుతోంది.

రెండవ ఐపీవోగా జాసన్స్ కెమెక్స్ కేర్ లిమిటెడ్ మార్కెట్లోకి వస్తోంది. ఇన్వెస్టర్ల కోసం జూలై 24 నుంచి జూలై 26 వరకు ఐపీవో తెరచి ఉంటుంది. కంపెనీ తన IPO ధరను రూ.40గా నిర్ణయించింది. ఒక్కో లాట్ పరిమాణం 3000 షేర్లు కంపెనీ నిర్ణయించింది. అంటే ఒక ఇన్వెస్టర్ కనీసం రూ.1,20,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐపీవో గ్రే మార్కెట్ ప్రీమియం రూ.9గా ఉంది.
ఇదే క్రమంలో జ్యూవెలర్స్ వ్యాపారంలోని కంపెనీ మూడో ఐపీవోగా అరంగేట్రం చేస్తోంది. SME క్యాటగిరీలో వస్తున్న ఖాజాంచి జ్యువెలర్స్ లిమిటెడ్ ఐపీవో జూలై 24న ఇన్వెస్టర్ల కోసం తెరవబడుతోంది. ఇది జూలై 28 వరకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను రూ.140కి విక్రయించాలని నిర్ణయిస్తూ ప్రైస్ బ్యాండ్ విలుడదల చేసింది. ఇన్వెస్టర్లు కనీసం 1000 షేర్లను కొనుగోలు చేసేలా లాట్ పరిమాణం నిర్ణయించబడింది.

ఇక మార్కెట్లోకి వస్తున్న నాలుగో స్టాక్ ఐపీవో శ్రీ టెక్‌టెక్స్ లిమిటెడ్. ఈ ఐపీవోలో పాల్గొనాలనుకునే ఇన్వెస్టర్లు జూలై 26 నుంచి జూలై 28 వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.54 నుంచి రూ.61గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఈ ఐపీవో లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా నిర్ణయించటం జరిగింది. కంపెనీ ఐపీవో ఆగస్టు 7న NSE SMEలో లిస్ట్ అవుతుంది.
చివరగా మార్కెట్లోకి దూసుకొస్తున్న ఐపీవో ఇన్నోవేటస్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్. ఈ IPO 25 జూలై 2023న తెరవబడి జూలై 27న క్లోజ్ ఉంటుంది. ఇన్నోవాటస్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ IPO లాట్ సైజు 3000 షేర్లు. కంపెనీ రూ.50 ధరను నిర్ణయించింది. గ్రేమార్కెట్ ప్రీమియం రూ.11గా ఉన్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications