Hyderabad: సెల్ఫ్ మేడ్ బిలియనీర్లు నివసిస్తున్న టాప్-10 నగరాలివే.. హైదరాబాద్..!
Billionaire Cities: ఇటీవల దేశంలో సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి బిలియనీర్లుగా మారిన టాప్-200 వ్యాపారుల జాబితాను హురున్ ఇండియా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం ఏమిటంటే వీరిలో ఎక్కువ మంది ఏఏ నగరాలకు చెందినవారు అన్నదే.
వివరాల్లోకి వెళితే "Top 200 Self-made Entrepreneur of the Millennia 2023" లిస్టులో అత్యధింకగా సంపన్నులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి ఉన్నట్లు వెల్లడైంది. ఈ నగరం నుంచి అత్యధికంగా 129 మంది వ్యాపార సంపన్నులు నివశించటం అందరినీ ఆకర్షిస్తోంది. దీని తర్వాత రెండవ స్థానంలో ముంబైలో అత్యధికంగా 78 మంది సెల్ఫ్ మేడ్ బిలియనీర్లు ఉన్నట్లు వెల్లడైంది. మూడో స్థానంలో సంపన్నులు నివాసం ఉంటున్న నగరంగా గురుగ్రామ్ 49 మంది ఎంటర్ ప్రెన్యూర్లను కలిగి ఉంది.

దేశ రాజధాని దిల్లీ సైతం బిలియనీర్లను కలిగి ఉన్న నగరంగా నాలుగో స్థానంలో 49 మంది వ్యాపారవేత్తలను కలిగి ఉంది. నాలుగో స్థానంలో నిలిచిన తమిళనాడు రాజధాని చెన్నైలో 18 మంది బిలియనీర్లు నివశిస్తున్నారు. దీని తర్వాతి స్థానంలో ఉన్న పూణేలో 16 మంది సెల్ఫ్ మేడ్ బిలియనీర్లు నివాసం ఉంటున్నట్లు వెల్లడైంది.

ఇదే సమయంలో విశ్వనగరంగా అనేక పెట్టుబడులను ఆకర్షిస్తున్న తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదులో 9 మంది కుభేరులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఈ నగరం అత్యధికంగా బ్యాంకింగ్, ఐటీ సేవలు, ఫార్మా, టెక్స్‌టైల్ వంటి రంగాల్లో పురోగతిని చూస్తోంది. ఇక గుజరాత్ రాష్ట్రం నుంచి ఉన్న అహ్మదాబాదులో 5 మంది బిలియనీర్లు నివాసం ఉంటున్నారు. ఇదే సమయంలో జైపూర్‌లో నలుగురు బిలియనీర్లు ఉండగా.. టాప్-10లో చివరి స్థానంలో నిలిచిన నోయిడాలో కూడా నలుగురు బిలినీర్లు హురున్ ఇండియా జాబితాలో స్థానాన్ని సంపాదించుకున్నారు.


Click it and Unblock the Notifications