Children Investment: చాలా మంది తమకంటే ముందు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారికోసం ఎక్కడ డబ్బు దాయాలా అని ఉత్తమ ఎంపికల కోసం వెతుకుతుంటారు.
మీరు అలాంటి తల్లిదండ్రులైతే ఈ వార్త మీకోసమే. పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లయితే.. ముందుగా తెలుసుకోవాల్సింది ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధికా గుప్తా వివరించిన మైనర్‌లకు పెట్టుబడి పెట్టడానికి సంబంధించిన సాధారణ అపోహల గురించే. ఆమె సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఎక్స్ వేదికగా చిట్కాలు అందించారు. ఇవి కొత్తగా తల్లిదండ్రులుగా మారినవారికి, పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

అన్నింటి కంటే ముఖ్యమైనది పిల్లల జనన ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్ ఆపై బ్యాంకు ఖాతా సిద్ధంగా ఉంచుకోవటం. ఈ పత్రాలన్నింటినీ పొందటం ఇప్పుడు అత్యంత సులభతరం. అలాగే మైనర్ పుట్టిన వెంటనే వారి పేరుపై కూడా పాన్ కార్డును పొందవచ్చని గుర్తుంచుకోండి. తద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో మైనర్ల పేరుపై పెట్టుబడులు పెట్టవచ్చని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో Edelweiss మ్యూచువల్ ఫండ్స్ మైనర్ ఫోలియోలను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి తల్లిదండ్రులను అనుమతిస్తుందని ఆమె తెలిపారు. త్వరలో మీరు కొత్త ఫోలియోలను కూడా సృష్టించడానికి వీలు కల్పిస్తామని చెప్పారు.
ఎంత చిన్న వయస్సులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే అంత మంచిదని రాధిక గుప్తా నొక్కి చెప్పారు. ఆమె తన పిల్లల విషయంలో 6 నెలల వయస్సులోనే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయటం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు వారి పిల్లల ఉన్నత చదువులు, పెళ్లి వంటి అవసరాల కోసం దాస్తుంటారు. మీరు విదేశాల్లో చదువుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు కరెన్సీని నిర్వహించడానికి మిడ్-స్మాల్ క్యాప్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్‌లను ఉపయోగించవచ్చని ఆమె తెలిపారు.
లక్ష్యాలు మారుతున్నప్పుడు క్రమానుగతంగా పెట్టుబడులను సమీక్షించటం ఉత్తమమని రాధిక చెప్పారు. మీరు లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ మరింత సంప్రదాయబద్ధంగా పెట్టుబడులను మార్చాలని తెలిపారు. చివరగా పిల్లలకు యూనిట్లు లేదా SIPలను బహుమతిగా ఇచ్చే వారిని ప్రోత్సహించమని ఆమె అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications