EPFO New Changes: నేటి కాలంలో చాలా మంది ప్రజలు వివిధ కంపెనీల్లో పనిచేస్తూ తమ యజమానుల నుంచి ఎంప్రాఈస్ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని అందుకుంటున్నారు. వాస్తవానికి ఇది ఉద్యోగి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం కార్మికుల కోసం రూపొందించిన వ్యవస్థ.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన సభ్యులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం EPFO సభ్యులు ఆధార్ లింకేజ్ ద్వారా నేరుగా తమ UANను అప్‌డేట్ చేసుకోగలరు. అలాగే ఎలాంటి పత్రాలను అప్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు. వారు తమ యజమాని సహాయం లేకుండానే తమ UAN వివరాలను మార్చుకోవచ్చు. గతంలో ఆమోదం కోసం 28 రోజుల వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సభ్యులు ఆ ఆమోదానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా తమ వివరాలను నవీకరించవచ్చు.

ఆధార్ లింక్ ద్వారా మార్చగల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. పేరు
2. పుట్టిన తేదీ
3. లింగం
4. తండ్రి లేదా తల్లి పేరు
5. మ్యారిటైల్ స్టేటస్
6. భార్య పేరు
7. ఉద్యోగంలో చేరిన తేదీ
8. ఉద్యోగం మానేసిన తేదీ
గతంలో వీటిలో మార్పులకు సంబంధిత యజమాని ఆమోదం అవసరం. కానీ ఇప్పుడు ఆధార్ లింక్ చేయడం ద్వారా వీటిని మార్చడం చాలా సులభంగా మారటంతో పాటు ట్రాన్పరెన్సీ పెరిగింది. 1 అక్టోబర్ 2017 తర్వాత UAN నంబర్ జనరేట్ చేయబడిన కొందరు మాత్రమే యజమాని ఆమోదానికి లోబడి ఉంటారు. అదేవిధంగా ఆధార్, పాన్ కార్డును అనుసంధానించడం చాలా ముఖ్యం, లేకుంటే ఆమోదం పొందడంలో ఆలస్యం అవుతుంది.
యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది EPF ఖాతాను నిర్వహించడంలో సహాయపడే 12-అంకెల అధీకృత నంబర్. EPF స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి UANని యాక్టివేట్ చేయడం, బ్యాంకు ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయడం అవసరం. వీటిని పూర్తి చేస్తే వ్యక్తులు చివరికి ఆలస్యాన్ని నివారించవచ్చు.
EPF ప్రొఫైల్‌ను ఎల్లప్పుడూ నవీకరించడానికి సూచనలు:
1. EPFO వెబ్‌సైట్ www.epfindia.gov.inకి వెళ్లి లాగిన్ అవ్వండి.
2. UAN నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చాతో సభ్యుల పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
3. పేజీ ఎగువన 'నిర్వహించు' ఎంచుకుని, 'ప్రాథమిక వివరాలను మార్చండి'పై క్లిక్ చేయండి.
4. ఆధార్ కార్డు ఉపయోగించి మీ వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు.
5. 'ట్రాక్ రిక్వెస్ట్' ఫీచర్‌ని ఉపయోగించి ప్రొఫైల్ అప్‌డేట్ ప్రాసెస్‌ను ట్రాక్ చేయండి.
ఈ కొత్త నిబంధనల మార్పు లక్షలాది మంది EPF సభ్యులకు EPFO సభ్యుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు కార్యాలయానికి ప్రయాణించాల్సిన అవసరం, సరైన పత్రాల కోసం వెతకడం, ఆమోదం కోసం వేచి ఉండటం వంటి ఇబ్బందులను తొలగిస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications