Byjus Fall: స్టార్టప్‌ల ప్రపంచంలో దూసుకుపోతున్న ఎడ్‌టెక్ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ స్వర్గం నుంచి దిగివచ్చారు. కరోనా కాలంలో విపరీతంగా పెరిగిన ఆయన వ్యాపారం ఇప్పుడు బతకటానికే కష్టపడుతోంది.
ఒకప్పుడు రూ.17,545 కోట్ల($2.1 బిలియన్) నికర విలువ కలిగిన రవీంద్రన్ సంపద ఇప్పుడు సున్నాకు చేరుకుంది. 'వరల్డ్స్ రిచెస్ట్' జాబితాలో బైజూ సంపద సున్నాకి తగ్గడం స్టార్టప్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశ ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ సంపద ఒక్కసారిగా క్షీణించింది.

2011లో బెంగళూరు కేంద్రంగా స్థాపించబడిన బైజూస్ భారతదేశపు అత్యంత విలువైన స్టార్టప్‌గా అవతరించింది. 2022లో కంపెనీ విలువ అత్యధికంగా 22 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సంస్థ ఇన్నోవేటివ్ లెర్నింగ్ యాప్ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చేసింది. ప్రాథమిక పాఠశాల నుండి MBA వరకు విద్యార్థులు బైజూస్ యాప్ నుండి ట్యూషన్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం కంపెనీ ఆర్థిక సమస్యలు, వివాదాలు ప్రతిష్ఠను తిగజార్చాయి.
మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ఫలితాలను పోస్ట్ చేసిన తర్వాత బైజు ఆర్థిక కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఇది $1 బిలియన్ కంటే ఎక్కువ నికర నష్టాన్ని ప్రకటించింది. దీంతో కంపెనీ విలువ ఏకంగా 1 బిలియన్ డాలర్‌కు తగ్గించబడింది. దీనికి తోడు బైజూ ఫెమా కింద రూ.9,362 కోట్లకు పైగా ఉల్లంఘించినట్లు ఆరోపణలపై ED విచారణను ఎదుర్కోవటంతో సవాళ్లను మరింత పెంచింది.
పునర్నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ వందల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఫోర్బ్స్ తన వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024 పరిశీలిస్తే గత ఏడాలో బిలియనీర్లుగా ఉన్న 189 మంది ఆ హోదాను కోల్పోయినట్లు వెల్లడైంది. పైగా జాబితాలో ఉన్నవారిలో నాలుగింట ఒక వంతు వారి సంపద 2023తో పోలిస్తే క్షీణించింది.


Click it and Unblock the Notifications