ప్రస్తుతం భారతదేశంలో అదానీ, అంబానీ అతిపెద్ద వ్యాపార సంస్థలుగా కొనసాగుతున్నాయి. అయితే వీటికి ముందు దేశంలో ఏర్పాటు చేయబడిన కొన్ని సంస్థలు దాదాపు 150 ఏళ్లుగా కొన్ని గ్రూప్స్ దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించటంలో దోహదపడ్డాయి.
వాడియా గ్రూప్:
దేశంలోని పురాతన వ్యాపార సమ్మేళనం ది వాడియా గ్రూప్. థాన్ వాడియా గ్రూప్‌ను 1736లో లవ్జీ నజర్వాంజీ వాడియా ప్రారంభించారు. అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నౌకలు, ఓడ సంబంధిత నిర్మాణాలను నిర్మించే కాంట్రాక్ట్‌తో ఈ కంపెనీ మొదట ప్రారంభమైంది. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం దాదాపు 300 నౌకలను నిర్మించింది. ఈ నౌకల్లో కొన్ని యుద్ధాల్లో కూడా ఉపయోగించబడ్డాయి. ఈ బృందం బాంబే డైయింగ్ కంపెనీని కూడా ప్రారంభించింది. తర్వాత విమానయానం, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలతో సహా వివిధ రంగాల్లో వ్యాపారాలను విజయవంతంగా ప్రస్తుతం దేశంలో నిర్వహిస్తోంది.

ఈట్ బారీ లిమిటెడ్:
చక్కెర, స్పిరిట్స్ వ్యాపారం చేయడానికి ఆంగ్లేయుడు థామస్ బారీచే 1788లో స్థాపించబడింది. ఇది దాదాపు ఆరు దశాబ్దాలుగా భారతదేశంలో అతిపెద్ద చక్కెర వ్యాపార సంస్థగా ఉంది. ఈ కంపెనీయే భారతదేశంలో తొలిసారిగా ఎరువుల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే స్వాతంత్ర్యం తర్వాత దీనిని 1962లో మురుకప్ప గ్రూప్ కొనుగోలు చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో బ్యాంకింగ్ సేవల వ్యాపారంలో ఉన్న పురాతన ప్రభుత్వ రంగ సంస్థ. 1806లో బ్రిటీష్ గవర్నర్ వెల్లెస్లీ బ్యాంక్ ఆఫ్ కలకత్తా పేరుతో టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో బ్రిటీష్ వారికి అవసరమైన నిధులను అందించడానికి ప్రారంభించారు. 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌గా దీని పేరు మార్చబడింది. తరువాత సంస్థ పేరును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇప్పటి వరకు భారతదేశంలో అత్యంత విజయవంతమైన ప్రభుత్వ బ్యాంకుల్లో కొనసాగుతోంది.

RPG గ్రూప్:
రామ్‌దత్ గోయెంకా 1820లో RPG గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం కంపెనీ చియాడ్ టైర్, RPG లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ కంపెనీతో సహా పలు వెంచర్లతో వ్యాపారాలను కొనసాగిస్తోంది. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, ఎనర్జీ ఉత్పత్తి వంటి వివిధ రంగాల్లో గ్రూప్ విజయవంతంగా దేశంలో ముందుకు సాగుతోంది.

ఆదిత్య బిర్లా గ్రూప్:
ఇక ఆదిత్య బిర్లా గ్రూప్‌ను 1857లో దేశంలో ప్రారంభించబడింది. ఈ కంపెనీ ప్రస్తుతం టెక్స్‌టైల్, ఫైనాన్స్, సిమెంట్, మినరల్, రిటైల్, పెయింట్, జ్యువెలరీ వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలను కొనసాగిస్తూ అగ్రగామిగా ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications