Budget Stocks: బడ్జెట్ ముందు కొనదగిన 5 స్టాక్స్ ఇవే.. నాలుగు రోజులే సమయం మిత్రమా..

Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి కూడా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె తీసుకునే నిర్ణయాలు ఏఏ రంగాల్లోని కంపెనీలకు అనుకూలంగా ఉండనుందనే ఉత్కంఠ భారతీయ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్న ప్రతి ఒక్కరిలోనూ కొనసాగుతోంది.

ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న 2025-26 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ ముందు కొన్ని షేర్లు ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు అనుకూలంగా ఉన్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈసారి బడ్జెట్లో రైల్వేలు, ఇన్ ఫ్రా రంగాలకు భారీ కేటాయింపులు ఉండవచ్చని, ఈ రంగాలకు ప్రోత్సాహం ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే బ్రోకరేజ్ సంస్థలు బడ్జెట్ ముందు బెట్టింగ్ వేయటానికి అనుకూలమైన షేర్ల జాబితాను బయటపెట్టారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడికి అవకాశాలను పరిశీలిస్తున్నారు.

Know budget stocks that suggested by Brokerages amid Union Budget 2025 nearing

- ముందుగా ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ కంపెనీ షేర్లు కొనుగోలుకు అనుకూలమైన షేరుగా బజాజ్ బ్రోకింగ్ పేర్కొంది. స్టాక్ ఇటీవల కన్సాలిడేషన్ శ్రేణి కంటే ఎక్కువ బ్రేక్‌అవుట్‌లో ఉందని వెల్లడించింది. కంపెనీ షేర్లను కొనుగోలు చేయటానికి రూ.190-200 ఎంట్రీ ధర శ్రేణిగా వెల్లడిస్తూ టార్గెట్ ధరను రూ.235గా వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ షేర్లు మార్కెట్లో ఒక్కోటి రూ.183 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

- బ్రోకరేజ్ రాడార్ లో రెండవ స్టాక్ డీసీఎక్స్ ఇండియా ఉంది. రానున్న త్రైమాసికాల్లో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.449 స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం రూ.355-380 మధ్య స్థాయిలో ఇన్వెస్టర్లు ఎంట్రీ తీసుకోవచ్చని వెల్లడించింది. అలాగే స్టాక్ ప్రస్తుత ట్రేడింగ్ ధర దాదాపు 328.35 రూపాయల వద్ద ఉంది.

- బజాజ్ బ్రోకరేజ్ బులిష్ వ్యూ కలిగి ఉన్న మరో కంపెనీ అయాన్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ షేర్లపైనే. స్టాక్ ప్రస్తుతం బలమైన అప్ ట్రెండ్ చూస్తోందని బ్రోకరేజ్ వెల్లడించింది. రానున్న ఏడాదిలో స్టాక్ ధర ఒక్కోటి రూ.780 స్థాయికి పెరుగుతుందని కంపెనీ వెల్లడించింది. స్టాక్ ప్రస్తుతం రూ.592 స్థాయి వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

- బడ్జెట్ ముందు బ్రోకరేజ్ రైల్వే షేర్లపై కూడా మక్కువను కలిగి ఉంది. ఈ క్రమంలో ఐఆర్సీటీసీ కంపెనీ షేర్లు భవిష్యత్తులో రూ.830-850 స్థాయిలకు చేరుకోవచ్చని భావిస్తున్నట్లు అంచనాలను బ్రోకరేజ్ ప్రకటించింది. ప్రస్తుతం స్టాక్ ధర రూ.787 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. రూ.780 వద్ద రెసిస్టెన్స్ స్థాయిని అధిగమించిన నేపథ్యంలో బులిష్ ట్రెండ్ కొనసాగవచ్చని వెల్లడించింది.

- ఇక చివరిగా ఛాయిస్ బ్రోకింగ్ బ్యాంకింగ్ స్టాక్ ఐడీబీఐపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం రూ.76 వద్ద కొనసాగుతున్న స్టాక్ ధర సమీప భవిష్యత్తులో ఒక్కోటి రూ.100 స్థాయికి పెరుగుతుందని అంచనా వేసింది. సమీప భవిష్యత్తులో రూ.88 స్థాయిని అధిగమిస్తే సులువుగా టార్గెట్ ధరను చేరుకుంటుందని చెబుతున్నారు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+