BSNL News: బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio, Viకి షాక్.. సూపర్..
BSNL Recharge Plan: ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL అద్భుతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు 50GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలను అందించనుంది.
మీరు వింటున్నది నిజమేనండి. కేవలం రూ.250లోపు చెల్లించి 36 రోజుల వ్యాలిడిటీని ఈ ఉత్తమ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద వినియోగదారులు పొందనున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది అందుబాటులోకి వచ్చిన BSNL ప్రీపెయిడ్ ప్లాన్ రూ.247 గురించే. ఇది తక్కువ ప్రీమియం చెల్లింపుతోనే వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తోంది. దీంతో ఈ రీఛార్జ్ ప్లాన్ మార్కెట్లో అనేక మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ BSNL రూ.247 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ హాఫ్ సెంచరీని కొట్టిన మొదటిది. 50GB హై-స్పీడ్ డేటా ప్రయోజనాలతో కూడిన బల్క్ డేటాను ప్లాన్ అందిస్తోంది. వినియోగదారులు డేటాను ఎలాంటి రోజువారీ పరిమితి లేకుండా అవసరమైన మేరకు వినియోగించుకోవచ్చు. అలాగే అద్భుతమైన ప్రయోజనం ఈ ప్లాన్‌తో వచ్చే అపరిమిత వాయిస్ కాల్స్. ఇతర ఆపరేట్ల మాదిరిగా కాకుండా బీఎస్ఎన్ఎల్ ప్లాన్ వ్యాలిడిటీని ఏకంగా 36 రోజులుగా ప్రకటించింది. అంటే కాల్స్ సేవలను 36 రోజుల వరకు అపరిమితంగా వినియోగించుకోవచ్చు. అలాగే ఉచిత SMS ప్రయోజనాలను రోజుకు 100 చొప్పున కస్టమర్లు పొందుతారు.
బీఎస్ఎన్ఎల్ వీటికి తోడు కొన్ని అదనపు ప్రయోజనాలను సైతం కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. BSNL ట్యూన్స్, Eros Now వంటి ఉచిత ప్రయోజనాల రీఛార్జీతో అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.250లోపే ఇన్ని సదుపాయాలను బీఎస్ఎన్ఎల్ అందించటం అదికూడా అధిక వ్యాలిడిటీతో రావటం టెలికాం రంగంలోని ఇతర ఆటగాళ్లైన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలకు పెద్ద షాక్ ఇస్తోంది.


Click it and Unblock the Notifications