BSNL News: అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్.. రేటు చూసి షాకవుతున్న Jio, Airtel, Vi..
BSNL News: దేశంలోని టెలికాం రంగంలో ప్రైవేటు ఆటగాళ్లకు ఏమాత్రం తగ్గకుండా బీఎస్ఎన్ఎల్ వేగంగా ముందుకు సాగుతోంది. జియో కంటే అత్యంత తక్కువ ధరలకు ఆకర్షనీయమైన ప్లాన్లతో ప్రత్యర్థి కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది.
స్మార్ట్ ఫోన్ యూజర్ల డేటా అవసరాలను తక్కువ ఖర్చుతో నెలంతా సేవలను పొందే విధంగా మెగా ప్లాన్స్ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న డేటా, ఎస్ఎమ్ఎస్, కాల్స్ బండిల్ ప్లాన్ కింద బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. దీంతో చాలా మంది తమ రెండో సిమ్ కింద దీనిని వినియోగించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బీఎస్ఎన్ఎల్ రూ.397 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించే. ఈ ప్లాన్ గతం నుంచే ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్ కింద రోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్‌లు, అపరిమిత కాల్స్ 60 రోజుల కాలానికి 180 రోజుల వ్యాలిడిటీతో లభించేవి. కానీ ఇప్పుడు ఈ బెనిఫిట్స్ 30 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులు మాత్రమే. అంటే వ్యాలిడిటీ కాలంలో ఇన్ కమింగ్ కాల్స్ ఎలాంటి అంతరాయం లేకుండా పొందొచ్చు.
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ రివైవల్ కోసం జూన్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మొత్తం రూ.89,047 కోట్లతో మూడవ పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. ఈ ప్యాకేజీలో ఈక్విటీ ఇన్ఫ్యూషన్ ద్వారా BSNL కోసం 4G, 5G స్పెక్ట్రమ్ కేటాయింపులు ఉన్నాయి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4జీ విస్తరణకు అవసరమైన సాంకేతికత, పరికరాలను టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications