Power Stocks: ఒకప్పుడు చిన్న పెన్నీ స్టాక్ గా ఉన్న అదానీ పవర్ చాలా మంది ఇన్వెస్టర్ల ఫేవరెట్ స్టాక్ గా మారింది. చాలా మంది రిటైలర్ల పోర్ట్ ఫోలియోలో స్టాక్ వచ్చి చేరటంతో అదానీ పవర్ స్టాక్ తెలియని వారు లేరని చెప్పటం అతిశయోక్తి కాదు.

అదానీ పవర్..
ఇటీవల హిండెన్ బర్గ్ నివేదికల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలు భారీగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం అదానీ పవర్ స్టాక్ మీద కూడా పడింది. అయితే ప్రస్తుతం పవర్ ఇండస్ట్రీకి చెందిన అదానీ పవర్, టాటా పవర్ కంపెనీల షేర్లు మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో అదానీ పవర్ 4.97 శాతం క్షీణించి రూ.164.30 వద్ద ఉంది. ఇదే సమయంలో టాటా పవర్ స్టాక్ కేవలం 0.36 శాతం క్షీణించి రూ.204.80 వద్ద ఉంది.

గరిష్ఠ-కనిష్ఠ ధరలు..
NSEలో అదానీ పవర్ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.432.50 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.108.70గా ఉంది. గడచిన ఏడాది కాలంలో స్టాక్ ఏకంగా 44.93 శాతం క్షీణించింది. ఇదే క్రమంలో 52 వారాల గరిష్ఠ ధర రూ.298.05 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.190గా ఉంది. ఏదాది ప్రాతిపధికన గమనించినట్లయితే స్టాక్ కేవలం 3.33 శాతం మాత్రమే నష్టపోయింది.

త్రైమాసిక ఫలితాలు..
పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి అత్యంత ముఖ్యమైన విషయం కంపెనీ దాబదాయకతను పరిశీలించటం. అయితే డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే.. టాటా పవర్ నికర లాభంలో వృద్ధిని నమోదు చేసింది. వార్షిక ప్రాతిపధికన కంపెనీ లాభం ఏకంగా 91 శాతం మేర పెరిగింది. ఇదే సమయంలో అదానీ పవర్ ఫలితాలను గమనిస్తే డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభం 96 శాతం మేర క్షీణించింది.

నిపుణులు ఏమంటున్నారంటే..?
ఆనంద్ రాఠీకి చెందిన జీగర్ ఎస్ పటేల్ టాటా పవర్‌లో వేచి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో Tips2tradesకి చెందిన AR రామచంద్రన్ మాట్లాడుతూ రానున్న కాలంలో టాటా పవర్ స్టాక్ రానున్న వారాల్లో రూ.225-238 స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు.

అదానీపై బ్రోకరేజ్..
అదానీ పవర్ స్టాక్ పై బ్రోకరేజ్ కంపెనీల నిపుణులు ఏమంటున్నారో గమనిస్తే.. రెలిగేర్ బ్రోకింగ్‌కు చెందిన అజిత్ మిశ్రా ఇన్వెస్టర్లు ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవద్దని తెలిపారు. ఇదే సమయంలో Tips2tradesకు చెందిన రామచంద్రన్ మాట్లాడుతూ ప్రస్తుతం అదానీ గ్రూప్ షేర్ల గురించి ఉన్న అన్ని వార్తలను పరిగణలోకి తీసుకుంటే అదానీ పవర్ షేర్లను కొనుగోలు చేయాలనుకోవటం ప్రమాదకరమైన పందెం అని అన్నారు. రానున్న వారాల్లో స్టాక్ ధర రూ.199-222 స్థాయికి చేరుకుంటుందని తెలిపారు.
Note: పైన తెలిపిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన బ్రోకరేజ్ కంపెనీల నిపుణుల అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. ఇన్వెస్ట్ మెంట్ నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications