IPO News: నేడే రాకేష్ జున్‌జున్‌వాలా కంపెనీ ఐపీవో స్టార్ట్.. పెట్టుబడి పెట్టొచ్చా..?? బ్రోకరేజీలు
IPO News: ఈరోజు కాంకర్డ్ బయోటెక్ ఐపీవో ప్రారంభం అవుతోంది. ఐపీవోలో పెట్టుబడి పెట్టాలనుకునే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇది మూడు రోజుల పాటు అంటే ఆగస్టు 8 వరకు తెరచి ఉంటుంది.
కాంకర్డ్ బయోటెక్ తాజా ఐపీవో ద్వారా రూ.1,551 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.705-741గా నిర్ణయించింది. ఒక్కో లాట్ లో 20 షేర్లను విక్రయిస్తోంది. 1984లో ప్రారంభమైన కంపెనీ స్వదేశీ పరిశోధన & అభివృద్ధి(R&D)తో నడిచే బయోఫార్మా కంపెనీ. ఇది ఇమ్యునోసప్రెసెంట్స్, ఆంకాలజీ విభాగాల్లో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది.

ఈ ఇష్యూలో హెలిక్స్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ ఆఫర్ ఫర్ సేల్(OFS) రూపంలో తన వాటాలను విక్రయిస్తోంది. కంపెనీ ఉద్యోగుల కోసం 10,000 ఈక్విటీ షేర్లను రిజర్వ్ చేసింది. వారు ఒక్కో షేరుపై రూ.70 తగ్గింపు పొందుతారని కంపెనీ వెల్లడించింది. రాకేష్ జున్‌జున్‌వాలా కుటుంబానికి చెందిన ట్రస్ట్‌లు కూడా కంపెనీలో వాటాను కలిగి ఉన్నాయి. కంపెనీ ఇండియాతో పాటు.. యూఎస్, యూరప్, జపాన్ సహా 70 కంటే ఎక్కువ దేశాలకు తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.
ఐపీవోలో పాల్గొని షేర్లను కొనుగోలు చేయాలా వద్దా అనే దానిపై బ్రోకరేజ్ సంస్థలు ఏమంటున్నాయో గమనిస్తే..
1. Stoxbox- Rating: Avoid
2. Reliance Industries- Rating: Subscribe
3. Swastika Investmart- Rating: Subscribe for listing gains
4. Choice Broking- Rating: Subscribe
5. Hensex Securities- Rating: Subscribe
6. Anand Rathi Shares and Stock Brokers- Rating: Subscribe for long term


Click it and Unblock the Notifications