Credit Card: దీపావళికి ముందు అంబానీ క్రెడిట్ కార్డులు.. రెండు వేరియంట్ల ప్రయోజనాలు..
Credit Card: దీపావళికి ముందు ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జతకట్టింది. ఈ క్రమంలో రెండు కో-బ్రాండెడ్ రిలయన్స్ SBI కార్డులను విడుదల చేసింది. వీటిని 100 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు.
కొత్త క్రెడిట్ కార్డులను రిలయన్స్ SBI కార్డ్, రిలయన్స్ SBI కార్డ్ ప్రైమ్ పేరుతో కార్డులను విడుదల చేస్తోంది. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో లావాదేవీలపై వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు, ఆఫర్‌లను అందించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కిరాణా వంటి వస్తువులపై ప్రయోజనాలను పొందుతారు.

రిలయన్స్ SBI కార్డ్ ప్రయోజనాలు:
- రిలయన్స్ SBI కార్డ్ కోసం వార్షిక రుసుము రూ.499గా ఉంది.
- రూ.1,00,000 వార్షిక ఖర్చు మైలురాయిని సాధించిన వినియోగదారులకు వార్షిక రుసుము మినహాయింపు ఉంటుంది.
- ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్‌లోడ్ మినహా ఇతర కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కి ఒక రివార్డు పాయింట్ అందించబడుతుంది.
- జాయినింగ్ ఫీజు చెల్లింపుపై రూ.500 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ కార్డు హోల్డర్లు పొందుతారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో చేసే కార్డు చెల్లింపులపై ప్రతి రూ.100కి 5 రివార్డు పాయింట్లు అందించబడతాయి.
- డైనింగ్, సినిమాలపై ఖర్చు చేసిన రూ.100కి 5 రివార్డ్ పాయింట్లు పొందుతారు.
- వివిధ రిలయన్స్ రిటైల్ స్టోర్‌ల నుండి రూ.3,200 విలువైన అదనపు తగ్గింపు వోచర్‌లు అందించబడుతున్నాయి.
- అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును కార్డు అందిస్తోంది.
రిలయన్స్ SBI కార్డ్ ప్రైమ్ ప్రయోజనాలు:
- రిలయన్స్ SBI కార్డ్ వార్షిక రుసుము రూ.2,999గా ఉంది. రూ.3,00,000 వార్షిక ఖర్చు మైలురాయిని సాధించిన వారికి ఇది మినహాయించబడుతుంది.
- కార్డు హోల్డర్లు రిలయన్స్ రిటైల్ స్టోర్లలో చేసే కార్డు కొనుగోళ్లపై ప్రతి రూ.100కి 10 రివార్డు పాయింట్లను అందుకుంటారు.
- డైనింగ్, సినిమాలు, దేశీయ విమానయాన సంస్థలు, అంతర్జాతీయ వ్యయంపై ఖర్చు చేసిన రూ.100 ఖర్చుకు 5 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి.
- ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్‌లోడ్ మినహా.. ఇతర రిటైల్ కొనుగోళ్లపై రూ.100 ఖర్చుకు 2 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి.
- జాయినింగ్ ఫీజు చెల్లింపుపై కార్డు హోల్డర్లు రూ.3,000 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ అందుకుంటారు.
- అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంటుంది.
- క్యాలెండర్ సంవత్సరానికి దేశీయ విమానాశ్రయ లాంజ్‌లలో 8 కాంప్లిమెంటరీ యాక్సిస్. అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్‌లలో 4 కాంప్లిమెంటరీ యాక్సిస్ అదించబడతాయి.
- BookMyShowలో ప్రతి నెలా రూ. 250 విలువైన 1 సినిమా టిక్కెట్ కార్డు హోల్డర్లకు అందిస్తుంది.


Click it and Unblock the Notifications