Success Story: రూ.5 లక్షలతో ప్రారంభం.. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.45,500 కోట్లు..
Basudeo Singh: భారత ఫార్మా రంగం చాలా పెద్ద స్థాయిలో వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కేవలం రూ.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో మెుదలుపెట్టి ప్రస్తుతం పెద్ద స్థాయికి చేరుకున్న వ్యక్తి విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ఫార్మా రంగంలో ప్రముఖ వ్యక్తిగా బాసుడియో సింగ్ ఒకరిగా ఉన్నారు. 83 ఏళ్ల వయస్సులో ఆయన ఆల్కెమ్ లేబొరేటరీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. వివిధ ఫార్మా ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.45,500 కోట్లుగా ఉండటం గమనార్హం. వాస్తవానికి అత్యంత చిన్న మెుత్తంలో ప్రారంభించిన వ్యాపారం ఇంత స్థాయికి వస్తుందని సింగ్ ఎప్పుడూ ఊహించలేదు.

బాసుదేయో సింగ్ బీహార్‌లో జన్మించారు. మొదట్లో ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత వ్యాపార ప్రారంభాన్ని తన బంధువు సంప్రదా సింగ్‌తో కలిసి ఫార్మా రంగంలోకి అడుగుపెట్టారు. పాట్నా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. బాసుడియో తన సోదరుడితో కలిసి 1962లో తన స్వగ్రామంలో ఫార్మా పంపిణీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభ విజయం తర్వాత.. సొంత ఫార్మా కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అలా కేవలం రూ.5 లక్షల మూలధనంతో తన సొంత ఫార్మా కంపెనీని ప్రారంభించేందుకు ముంబైకి వెళ్లారు.
ప్రభుత్వం నుంచి అన్ని చట్టపరమైన అనుమతులు పొందటంతో 1973లో సింగ్ ఆల్కెమ్ లోబొరేటరీస్ కంపెనీని స్థాపించారు. ఈ సమయంలో కూడా బాసుడియో సింగ్ తన ఫార్మాస్యూటికల్ పంపిణీ వ్యాపారాన్ని వదలకుండా కొనసాగించడం విశేషం. 1984లో కంపెనీ రూ.10 కోట్ల ఆదాయ మార్కును అందుకుంది. కొన్ని దశాబ్దాల తర్వాత బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే టాక్సిమ్ అనే ఔషధాన్ని విడుదలతో భారీ వృద్ధిని సాధించింది. అలా దేశంలో రూ.100 కోట్ల వార్షిక అమ్మకాలను నమోదు చేసిన మొదటి యాంటీ ఇన్ఫెక్టివ్ డ్రగ్‌గా నిలిచింది.
2008 నాటికి సంస్థ రూ.1,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. ఆల్కెమ్ లేబొరేటరీస్ తన వ్యాపార ప్రయాణంలో భాగంగా.. ఫార్మాకోర్, అసెండ్ లేబొరేటరీస్, ఇంజినీ బయోసైన్స్ అనేక ఇతర కంపెనీలవప కొనుగోలు చేసింది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో లాంచ్ ద్వారా ఒక బిలియన్ డాలర్ల ఆదాయాన్ని దాటగలిగింది.


Click it and Unblock the Notifications