High Interest FD: పెట్టుబడులకు ఎన్ని మార్గాలు, కొత్త సాధనాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినా భారతీయులను ఆకర్షిస్తున్నవి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. దీర్ఘకాలంలో సురక్షితమైన, అధిక భద్రత కలిగిన పెట్టుబడి ఎంపికగా ఇవి తమ స్థానాన్ని మెుదటి స్థానంలోనే కొనసాగిస్తున్నాయి.
సాధారణంగా చాలా మంది పిల్లల చదువులు, కుమార్తె పెళ్లి లేదా సొంతింటి కోసం అని దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ వడ్డీ వచ్చినప్పటికీ అవసరమైన వెంటనే తీసుకునేందుకు వీలు ఉంటుందని బ్యాంకుల్లో డబ్బును ఎఫ్ డి రూపంలో డిపాజిట్ చేస్తుంటారు. అలాగే కొంత మంది తమ వద్ద అదనంగా ఉన్న మెుత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో దాచుకునేందుకు సైతం ఈ బ్యాంక్ డిపాజిట్లవైపు ఎక్కువగా చూస్తుంటారు.

ఐసిఐసిఐ బ్యాంక్ : ఐసిఐసిఐ బ్యాంక్ సాధారణ కస్టర్లకు ఐదు సంవత్సరాల పదవీకాలానికి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లు తమ ఐదేళ్ల FDలో 7.5 శాతం వడ్డీని పొందుతారు. ఈ రేట్లు జూలై 12, 2024 నుంచి అమలులోకి వచ్చాయి.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్లు పొందేందుకు అర్హులుగా బ్యాంక్ వెల్లడించగా ఈ రేట్లు జూన్ 12, 2024 నుంచి అమలులో ఉన్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్: కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు అత్యధికంగా 6.2 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 6.7 శాతం అందిస్తోంది. ఈ రేట్లు జూన్ 14, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్య బ్యాంకింగ్ సంస్థ తన 5 ఏళ్ల కాలవ్యవధిలో సాధారణ పౌరులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.5 శాతం ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న వడ్డీ రేట్లు జూన్ 15, 2024 నుంచి అమలులో ఉన్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ సంస్థ సాధారణ పౌరులకు ఐదేళ్ల కాలపరిమితిపై 6.5 శాతం, సీనియర్ సిటిజన్‌లు 7 శాతం డిపాజిట్లపై చెల్లిస్తోంది. అయితే ఈ రేట్లు జూన్ 10, 2024 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఐదేళ్ల డిపాజిట్లపై 6.5 శాతం అందిస్తుండగా.. సీనియర్ సిటిజన్‌లకు 7.15 శాతం ఆఫర్ చేస్తోంది. ఈ వడ్డీ రేట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జూన్ 12, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications