Fixed Deposits: దేశంలో ద్రవ్యోల్బణం కట్టడి చర్యల్లో భాగంగా రెపో రేట్లను రిజర్వు బ్యాంక్ పెంచటంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను బ్యాంకులు పెంచాయి. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు సాధారణ డిపాజిటర్లకు 8.50 శాతం కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.
ముందుగా యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ డిపాజిటర్లకు అత్యధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇది 1001 రోజుల కాలానికి 9 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే బ్యాంక్ 501 రోజులకు 8.75 శాతం, ఆరు నెలల నుంచి 201 రోజులకు 8.75 శాతం, 3 నుంచి 5 ఏళ్ల కాలానికి 8.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది. సాధారణంగా వాణిజ్య బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు పొదుపరులకు కొంత ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైతం సాధారణం డిపాజిటర్లకు మంచి వడ్డీ రేట్లను అందుబాటులో ఉంచింది. 366 రోజుల నుంచి 499 రోజులకు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 501 రోజుల నుంచి 2 ఏళ్ల కాలానికి 8.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
ఇదే క్రమంలో ఉజ్జీవ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లు పొందగలిగే గరిష్ఠ వడ్డీ రేటు 8.25%గా ఉంది. అలాగే సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 8.75 శాతం వడ్డీని అందిస్తోంది. ప్లాటినం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద కనీస పెట్టుబడి రూ.15 లక్షలు చేసేవారికి బ్యాంక్ ప్రత్యేకంగా 8.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైతం సాధారణ పెట్టుబడిదారులకు మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ 444 రోజులకు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50 వడ్డీని అందిస్తోంది. అలాగే ఏడాది నుంచి 443 రోజులకు చేసే డిపాజిట్లపై 8.20 శాతం వడ్డీని, రెండు సంవత్సరాల ఒక్క రోజు నుంచి 887 రోజులకు చేసే డిపాజిట్లపై 8 శాతం వడ్డీని, 445 రోజుల నుంచి 18 నెలలకు చేసే డిపాజిట్లపై 8.20 శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే ఆథరైజ్డ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు కాబట్టి రూ.5 లక్షల వరకు చేసే డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications