Fixed Deposits: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచిన తర్వాత దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. గత కొన్ని రోజులుగా చాలా బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతున్న తరుణంలో బ్యాంకులు భారీగా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో 9 శాతం వడ్డీ రేటును అందిస్తున్న రెండు బ్యాంకుల గురించి ఇప్పుడే తెలుసుకోండి..
ఆర్బీఐ రేటు పెంపు తర్వాత సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా వడ్డీ రేట్లు డిసెంబర్ 6 నుంచి అమలులోకి వచ్చాయి. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై సామాన్యులకు 9.01 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.26 శాతం వడ్డీని బ్యాంక్ గరిష్ఠంగా ఆఫర్ చేస్తోంది. ఈ రేట్లు 15 రోజుల నుంచి 5 ఏళ్ల కాలానికి సంబంధించిన డిపాజిట్లపై అందుబాటులో ఉన్నాయి.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తాజాగా పెంచింది. బ్యాంక్ FDలపై సీనియర్ సిటిజన్లకు 4.5 శాతం నుంచు 9 శాతం వరకు వడ్డీ రేట్లను బ్యాంక్ అందిస్తోంది.ఇది ప్రస్తుతం సీనియర్ సిటిజన్‌లకు వరుసగా 181-501 రోజుల FDలపై 9 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వయస్కులకు 181 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై 8.50 శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications