High FD Rate: డబ్బును సురక్షితంగా దాచుకునేందుకు ఉత్తమమైన ఎంపికల్లో ఒకటి ఫిక్స్‌డ్ డిపాజిట్. మీరు డబ్బును వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లయితే ఏడాది కాలానికి అద్భుతమైన వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న 5 బ్యాంకుల గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
DCB Bank:
డీసీబీ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7.25% వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదే కాలానికి అత్యధికంగా 7.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

Tamil Nadu Mercantile Bank:
ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7.25% వడ్డీని అందిస్తోంది. మరోవైపు బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదే కాలానికి FDపై 7.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
Canara Bank:
ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7% వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇదే క్రమంలో సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదే కాలానికి 7.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
Karnataka Bank:
ప్రైవేటు రంగంలోని కర్ణాటక బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7% వడ్డీని అందిస్తోంది. ఇదే సమయంలో బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.40 శాతం వడ్డీని ఇస్తోంది.
Deutsche Bank:
డ్యుయిష్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం FDపై 7% వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు FDపై అదే కాలానికి 7% వడ్డీని మాత్రమే అందిస్తోంది.


Click it and Unblock the Notifications