Bank Holidays In November 2022: నవంబర్‌లో నెలలో బ్యాంకులు దాదాపు 10 రోజులు సెలవుల్లో ఉండనున్నాయి. దీనివల్ల దేశంలోని వివిధ బ్యాంకులు మూతబడతాయి. ఈ సమయంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులో ఉంటున్నప్పటికీ.. కొన్ని కీలక పనులు పూర్తిచేసుకోవటానికి బ్రాంచ్ కు వెళ్లటం తప్పనిసరి. రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం సెలవుల వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

సెలవులు ఇలా..
దేశవ్యాప్తంగా బ్యాంకులకు స్థానిక పండుగలకు అనుగుణంగా సెలవులు మారుతుంటాయి. ఇవి వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు వేరువేరుగా ఉంటుంటాయి. నవంబర్ నెలలో బ్యాంకులు ఏకంగా మూసివేయబడతాయని గమనించండి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులు రాష్ట్రాలు పాటించే సెలవుల వివరాలను ఇప్పుడు చూద్దాం.

నవంబర్ 2022 బ్యాంక్ సెలవులు..
November:1 కన్నడ రాజ్యోత్సవం/కుట్
November:8 గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/రహస్ పూర్ణిమ
November:11 కనకదాస జయంతి/వంగల ఉత్సవం
November:12 రెండవ శనివారం
November:13 ఆదివారం
November:20 ఆదివారం
November:23 సెంగ్ కుత్స్నెం
November:26 నాల్గవ శనివారం
November:27 ఆదివారం

సెలవులు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు మూడు బ్రాకెట్ల కింద సెలవులను ప్రకటిస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్, బ్యాంకుల ఖాతాల ముగింపు కింద ఉంటాయి. బ్యాంకు సెలవులు వివిధ రాష్ట్రాల్లో మారుతూ ఉంటాయి. ఈ రూల్స్ అన్ని బ్యాంక్ కంపెనీలు పాటించవు. గెజిట్ సెలవులు, పండుగల సెలవులు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. అయితే సెలవుల సమయంలోనూ ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి వినియోగదారులు తమ పనులను పూర్తి చేసుకునేందుకు వీటిని వినియోగించుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.


Click it and Unblock the Notifications