Banking News: ఈ ఏడాది బ్యాంకులకు వరుస సెలవులు అధికమయ్యాయి. ఈ క్రమంలో నెల చివరికి వస్తున్న వేళ ఈవారం వరుస బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. దీంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సిన వారికి అధిక సమయం పట్టొచ్చని గమనించాలి.
ఈ వారం బ్యాంకుకు వెళ్లి ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన పని ఏదైనా ఉన్నట్లయితే.. మీరు చాలా కాలం నిరీక్షించక తప్పదు. ఎందుకంటే బుద్ధ పూర్ణిమ, నజ్రుల్ జయంతి, లోక్‌సభ ఎన్నికలు, శని-ఆదివారం కారణంగా నాలుగు రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు వరుస సెలవులతో మూడపడనున్నాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం మే 23న గురువారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే ఈ సమయంలో వినియోగదారులు తమ అవసరాలను డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవటం ద్వారా నిరంతరాయంగా పూర్తి చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అన్ని ప్రభుత్వ బ్యాంకులు మే నెలలో కనీసం 10 రోజులు సెలవులో ఉన్నాయి. వాస్తవానికి ఆదివారం రెగ్యులర్ సెలవుతో పాటు రెండవ, నాలుగో శనివారం సైతం బ్యాంకు శాఖలు సెలవులో ఉండనున్నాయి. ఈ బ్యాంకు సెలవుల జాబితా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటాయి. అయితే మిగిలిన సెలవుల విషయంలో రిజర్వు బ్యాంక్ అందించే సెలవుల జాబితాకు అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో భిన్నంగా ఉంటుంటాయి. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ సెలవులతో కలిపి సంవత్సరానికి అన్ని బ్యాంకుల సెలవు క్యాలెండర్‌ను RBI నిర్ణయిస్తుంది. ఇందులో అన్ని మతపరమైన పండుగలు లేదా ప్రాంతీయ ఆచారాలు సమానంగా పరిగణలోకి తీసుకోబడతాయి.
వరుస సెలవులు..
మే 23, 2024: బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశంలోని త్రిపుర, మహారాష్ట్ర, మిజోరం, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, న్యూదిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
మే 25, 2024: నజ్రుల్ జయంతి/లోక్‌సభ సాధారణ ఎన్నికల 2024 కారణంగా మే 25న బ్యాంకులు మూసివేయబడతాయి.
మే 26, 2024: ఆదివారం సెలవు
భౌతికంగా బ్యాంకు శాఖలు సెలవులో ఉన్నప్పటికీ బ్యాంకింగ్ సంస్థలు తమ డిజిటల్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుంటాయి. వాటి నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది వారికి అందుబాటులో ఉంటారు. అందువల్ల డిజిటల్ రూపంలో వినియోగదారులు తమకు ఉన్న మెజారిటీ పనులను ఇప్పటికీ మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చని గుర్తుంచుకోండి.


Click it and Unblock the Notifications