Bank Holidays December 2022: ఏడాది చివరి నెల వచ్చేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ మాసంలో రిజర్వు బ్యాంక్ బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఇవి వేరువేరుగా ఉంటాయి.

13 రోజులు సెలవులు..
నవంబర్ నెల ముగియడానికి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. చివరి నెల కావటంతో క్రిస్టమస్ తో పాటు నూతన సంవత్సర వేడుకలతో పాటు ఇతర కారణాలతో బ్యాంకులు ఏకంగా 13 రోజులు మూతపడనున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమైన పనులు ఉన్నట్లయితే కస్టమర్లు ముందుగానే వాటిని పూర్తి చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.

RBI సెలవుల క్యాలెండర్..
బ్యాంకులు ఏఏ రోజుల్లో మూసివేసి ఉంటాయనే దానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల ఒక హాలిడే క్యాలెండర్ జాబితాను విడుదల చేస్తుంది. దీనిలో స్థానిక పండుగలకు అనుగుణంగా ఈ సెలవుల లిస్ట్ వేరువేరు రాష్ట్రాలకు మారిపోతుంటుంది. అందుకే ముందుగా వీటిని తెలుసుకుని పనులు పూర్తి చేసుకోవటం, లేదా వాటి కోసం బ్యాంకులకు వెళ్లటాన్ని ప్లాన్ చేసుకోవటం మంచిది. తీరా బ్యాంకుకు వెళ్లి తాళం వేసిఉందని నిరుత్సాహంగా ఇంటికి రావటం కంటే సెలవుల లిస్ట్ చూసుకోవటం ఉత్తమం..

డిసెంబర్ బ్యాంక్ సెలవులు..
డిసెంబర్ 3- సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విందు - గోవా
డిసెంబర్ 4- ఆదివారం
డిసెంబర్ 10- రెండవ శనివారం
డిసెంబర్ 11- ఆదివారం
డిసెంబర్ 12- పా-టోగన్ నెంగ్మింజ సంగ్మా- మేఘాలయ
డిసెంబర్ 18- ఆదివారం
డిసెంబర్ 19- గోవా విమోచన దినం- గోవా
డిసెంబర్ 24- క్రిస్మస్ విందు, నాలుగవ శనివారం- మేఘాలయ
డిసెంబర్ 25- క్రిస్మస్ పండుగ
డిసెంబర్ 26- క్రిస్మస్ వేడుక / Losung / Namsung- ఐజ్వాల్, గాంగ్టక్, షిల్లాంగ్
డిసెంబర్ 29- గురు గోవింద్ సింగ్ జీ పుట్టినరోజు- చండీగఢ్
డిసెంబర్ 30- యు కియాంగ్ నంగ్వా- మేఘాలయ
డిసెంబర్ 31- నూతన సంవత్సర వేడుకలు- మిజోరం

బ్యాంకింగ్ సేవలు..
వివిధ ప్రాంతాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకలు సెలవులో ఉన్నప్పటికీ సేవల్లో ఎలాంటి ఆటంకం ఉండదు. బ్యాంక్ శాఖలు మూతపడి ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ సంబంధిత పనులను ఇంటి వద్ద నుంచే పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇది రోజులో 24 గంటలు అందుబాటులో ఉంటున్నందున కస్టమర్లు చింతించాల్సిన అవసరం ఉండదు. అయితే నేరుగా బ్యాంక్ శాఖకు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనులు మాత్రం సెలవుల కారణంగా పెండింగ్ పెడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సకాలంలో వాటిని పూర్తి చేసుకోవటం ముఖ్యం.


Click it and Unblock the Notifications