Kejriwal Assets: నేడు వచ్చిన దిల్లీ ఎన్నికల ఫలితాల దశాబ్ధాల చరిత్రను తిరగరాశాయి. ఈ క్రమంలో నేడు బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా.. ఆప్ 22 స్థానాలకు పరిమితం అయ్యింది. దీంతో 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా దేశరాజధాని దిల్లీలో బీజేపీ గెలుపు జెండా ఎగురవేసింది. ఎన్నికలకు ముందు పన్ను పరిమితి పెంపు నుంచి అనేక బీజేపీ కార్యక్రమాలపై ప్రజలు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో ఏకంగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓటమిని చవిచూశారు.
దిల్లీ ప్రజలను మెప్పింటి ఎట్టకేలకు క్లీన్ ప్రభుత్వంగా పేరున్న ఆమ్ ఆద్మీ పార్టీని ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఓడించటం మోదీకి పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. వాస్తవానికి లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన ఆప్ నేతలు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూదిల్లీ నియోజకవర్గం ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సీఎం అతిషి సింగ్ మాత్రం స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు.

దిల్లీ ఎన్నికల ఫలితాల సమయంలో చాలా మంది ప్రస్తుతం అసలు సీఎంగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కేజ్రీవాల్ ఎన్నికల నామినేషన్ సమయంలో కుటుంబ ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. మెుత్తం నికర ఆస్తుల విలువ రూ.1.73 కోట్లుగా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే బ్యాంక్ బ్యాలెన్స్ రూ.2.96 లక్షలు, లిక్విడ్ క్యాష్ రూ.50 వేలు, చరాస్తుల విలువ రూ.1.70 కోట్లుగా ప్రకటించారు. అలాగే 2023-24లో ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని రూ.7.21 కోట్లుగా వెల్లడించారు.
దేశంలోని చాలా మంది సీఎంల మాదిరిగా కాకుండా కేజ్రీవాల్ తనకు సొంత ఇల్లు కానీ, కారు కానీ లేదని వెల్లడించటం గమనార్హం. కేజ్రీవాల్ భార్య సునీత ఆస్తుల విలువ రూ.2.5 కోట్లుగా వెల్లడించారు. చరాస్తుల విలువ రూ. కోటిగా వెల్లడించారు. ఇక 320 గ్రాముల గోల్డ్, కేజీ వెండి, రూ.1.5 కోట్ల విలువైన స్థిరాస్తులు కూడా తనకు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఇకపోతే కేజ్రీవాల్ భార్యకు ఒక కారు, గురుగ్రాములో ఒక ఇల్లు కూడా ఉన్నట్లు అఫిడవిట్ ప్రకారం తేలింది. ఇక్కడ గత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కంటే ఆయన భార్య ఆస్తుల విలువే ఎక్కువ. 2015లో ఆస్తుల విలువ రూ.2.1 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్న కేజ్రీవాల్ 2020లో రూ.3.4 కోట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications