Radhika Merchant: దేశంలో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి ముందు కుమార్తె ఇషాకు కవలలు జన్మించటంతో అంబానీ ఇంట గత కొంత కాలంగా శుభకార్యాల జోరు కొనసాగుతోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి కొత్తగా రానున్న కోడలిపై ఉంది.

తర్వలో పెళ్లి పీటలు..
అనంత్ అంబానీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఆయన రానున్న రోజుల్లో రాధికా మర్చంట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా డిసెంబర్ 29న వారిద్దరి కుటుంబం రోకాను ఘనంగా రాజస్థాన్ లో నిర్వహించారు. దీనికి తోడు బిలియనీర్ చిన్న కుమారుడు అనంత్ కొత్త ఇంధన వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుపై విస్తృతంగా పెట్టుబడులు పెట్టింది

రాధిక ఏం చేస్తారు..
అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పైగా అనంత్, రాధికా చిన్ననాటి నుంచి మంచి మిత్రులు. కాగా అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. రాధిక భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ CEO అయిన వీరేన్ మర్చంట్ కుమార్తె కావటం విశేషం.

రాధిక మర్చంట్ ఆస్తులు..
ప్రస్తుతం రాధిక ఎంకోర్ హెల్త్‌కేర్ బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాధికా మర్చంట్ చాలా స్టైలిష్‌గా ఉంటారు. దీనికి తోడు ఆమెకు డ్యాన్స్, స్విమ్మింగ్, పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. 2018లో ఈ జంట ఫోటో వైరల్ కావడంతో వారు వార్తల్లో హెడ్ లైన్ గా మారారు. రాధిక తల్లి పేరు శైలా మర్చంట్, తండ్రి వీరేన్ మర్చంట్. ప్రస్తుతం ఉన్న మీడియా కథనాల ప్రకారం రాధిక నికర ఆస్తుల విలువ కేవలం రూ.8-10 కోట్లు మాత్రమేనని తెలుస్తోంది. అయితే ఈమె ఏకైక కుమార్తె కావటంతో ఆస్తులకు ఆమె వారసురాలు అవుతుంది.

రాధిక చిన్నతనం..
రాధిక కుటుంబం గుజరాత్‌లోని కచ్‌కు చెందినది. వ్యాపారవేత్తల కుటుంబంలో రాధిక 1994, డిసెంబర్ 18న జన్మించింది. ముంబైలో జన్మించిన ఆమె తన విద్యను కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, కోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్‌లో పూర్తి చేసింది. 28 ఏళ్ల రాధిక ట్రెండ్ డ్యాన్సర్. ఆమె శ్రీ నిభా ఆర్ట్స్‌కు చెందిన గురు భావ థాకర్ నుండి భరతనాట్యం నేర్చుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల జియో వరల్డ్ సెంటర్లో ప్రముఖుల సమక్షంలో అరంగేట్రం కార్యక్రమాన్ని అంబానీ కుటుంబం ఏర్పాటు చేసింది. దీనికి అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అలాగే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే, వారి ఇద్దరు కుమారులు ఆదిత్య, తేజస్ ఠాక్రేతో సహా పలువురు రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications