April 1st Tax Rules: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2023 ప్రకారం ఆదాయపు పన్ను వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ఇవి ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వస్తాయి. పన్ను చెల్లింపుదారులు ఈ కీలక మార్పుల గురించి తప్పక తెలుసుకోవాల్సి ఉంది.
బడ్జెట్ సమావేశంలో ప్రసగింస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను లిమిట్స్ శ్లాబ్ రేట్ల విషయంలో మార్పులను ప్రకటించింది. అలాగే కొత్త పన్ను విధానం కింద రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనికి తోడు రూ.7 లక్షలు దాటి స్వల్పంగా ఆదాయం పొందినప్పుడు సైతం ఊరట లభించే విధంగా ఊరటను కూడా ఇటీవల ప్రకటించింది. అన్నింటి కంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే కొత్త పన్ను విధానాన్ని కేంద్రం డీఫాల్ట్ టాక్స్ ఫైలింగ్ సిస్టమ్‌గా మార్చుతున్నట్లు ప్రకటించింది.

రూ.15.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉంటే వారికి రూ.52,500 స్టాండర్డ్ డిడక్షన్ కింద లభించనుంది. అలాగే కొత్త పన్ను విధానంలో పన్ను రహిత ఆదాయం శ్లాబ్ రేటును రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.15 లక్షల కంటే ఎక్కువ వార్షిక వేతనం ఉన్నవారికి 30% పన్ను రేటు, జీతం ఉన్న ఉద్యోగులకు TDS తగ్గింపు వంటివి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇదే సమయంలో పాత పన్ను విధానం సైతం పన్ను చెల్లింపుదారులకు అందుబాటులోనే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.
భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్(EGR)గా మార్చుకోవటం లేదా రిసీట్ లను గోల్డ్ గా మార్చుకోవటాన్ని సెబీ అథీకృత వ్యాల్ట్ మేనేజర్ ద్వారా చేసినట్లయితే వాటిపై ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి పన్ను ఉండబోదు. రూ.5 లక్షల కంటే ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం నుంచి వచ్చే ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. సాధారణ నివాసితులు రూ.50,000 కంటే ఎక్కువ బహుమతులు పొందితే అవి పన్ను పరిధిలోకి వస్తాయి.
క్యాపిటల్ ఎసట్స్ విక్రయించినప్పడు వచ్చే లాభాలపై సెక్షన్-54, 54F కింద గరిష్ఠంగా లభించే ప్రయోజనాలను రూ.10 కోట్లకు పరిమితం చేస్తూ సవరణలు చేయటం జరింగి. అందుకే ఖరీదైన లగ్జరీ ఆస్తుల కొనుగోలు విపరీతంగా పెరిగింది. కొత్తగా ప్రవేశపెట్టిన సెక్షన్ 115BBJ ప్రకారం ఆన్‌లైన్ గేమ్‌ల నుంచి ఎలాంటి విజయాలైనా 30% ఫ్లాట్ రేట్ కింద పన్ను వసూలు చేయబడతాయి.


Click it and Unblock the Notifications