Rakshabandhan Investments: ప్రతి సందర్భంలో డబ్బుకు ఒక కీలక పాత్ర ఉంటుంది. ప్రస్తుతం భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే రాఖీ పౌర్ణమి రోజున సోదరులు తమ అక్కచెల్లెళ్లకు ఆర్థికంగా అండగా నిలిచే బహుమతులు ఇవ్వటం ఒక ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు.
సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టగానే బహుమతి ఇవ్వటం సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నదే. ఈ క్రమంలో కొందరు వారికి బట్టలు, చాక్లెట్లు, డబ్బు, గిఫ్ట్స్, గోల్డ్, సిల్వర్ లేదా ఇతర ఇష్టమైన వాటిని బహుకరిస్తుంటారు. ఈ క్రమంలో వారి ఆర్థిక భద్రత, శ్రేయస్సు కోసం మీరు ఎఫ్‌డీ, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి వంటి విభిన్న ఆర్థిక గిఫ్ట్ అందించటం భవిష్యత్తులో మంచి రాబడులను వారికి అందిస్తాయి. ఇదే క్రమంలో సోదరులు తమ ప్రియతములకు పీపీఎఫ్, ఎన్‌పీఎస్, సుకన్య సమృద్ధి యోజన వంటి పెట్టుబడులను కూడా బహుకరించవచ్చు.

* ముందుగా ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ సోదరి పేరు మీద ఓపెన్ చేయించవచ్చు. FDపై ఏడు శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీని రెగ్యులర్ గా పొందుతారు. ఇందుకోసం బ్యాంకులో సోదరి పేరుపై బ్యాంక్ ఖాతా వసూలు చేయాల్సి ఉంటుంది లేదా వారికి ఇప్పటికే ఖాతా ఉన్నట్లయితే బహుమతిగా FD సొమ్మును డిపాజిట్ చేయటం సులువు. పైగా ఈ డబ్బుకు పూర్తి భద్రత కూడా ఉంటుంది.
* సోదరి పేరు మీద కూడా పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక. దీని మెచ్యూరిటీ వ్యవధి 15 ఏళ్లు. దీన్ని ఇంకా పొడిగించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 పెట్టుబడి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడిపై 7.1 శాతం రాబడితో పాటు 5 ఏళ్ల తర్వాత ఒకసారి డబ్బు ఉపసంహరణకు వెసులుబాటు ఉంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్గంలో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో లేదా పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
* ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెట్టుబడికి అవకాశం ఉన్న నేషనల్ పెన్షల్ స్కీమ్ ప్రస్తుతం సామాన్య ప్రజలకు సైతం రిటైల్మెంట్ ప్లానింగ్ కోసం పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తోంది. దీని కింద టైర్-1 ఖాతా తెరవడానికి సంవత్సరానికి కనీస సహకారం రూ.1,000. అలాగే నెలకు కనీస సహకారం పరిమితి రూ.500గా ఉంది. ఇందులో 60 ఏళ్ల తర్వాత పెన్షన్‌కు హామీ ఉంటుంది. ఈ ఖాతాను ఆన్‌లైన్‌లో సులభంగా తెరవవచ్చు.
* ఇదే క్రమంలో సోదరి పేరుమీద మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి మార్గాల్లో కూడా పెట్టుబడులు కొనసాగించవచ్చు. అలాగే ఆభరణాల రూపంలో ఫిజికల్ గోల్డ్ అండ్ సిల్వర్ సైతం కొనుగోలు చేయవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications