TMB IPO: 100 ఏళ్లనాటి బ్యాంక్ ఐపీవో నేటి నుంటే ప్రారంభం.. ఈ విషయాలు తెలుసుకుని ఇన్వెస్ట్ చేయండి..
TMB IPO: తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO సోమవారం సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడింది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ రూ.831.6 కోట్ల IPO సెప్టెంబర్ 7న ముగుస్తుంది. షేర్ బ్యాండ్ ఫ్రైస్ రూ.500-525 ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 1.58 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ద్వారా జారీచేయపడతాయి. ఇష్యూలో 75 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు కంపెనీ వెల్లడించింది.

వ్యాపార అవసరాలకు వినియోగం..
టుటికోరిన్ కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్.. ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని భవిష్యత్ మూలధన అవసరాలను తీర్చడానికి దాని టైర్-1 క్యాపిటల్ బేస్‌ను పెంచుకోవడానికి ఉపయోగించుకోనుంది. యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, SBI క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా ఉన్నాయి. ఈక్విటీ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈలో లిస్ట్ కానున్నాయి.

ఐపీవో ముఖ్య విషయాలు..
బ్యాంక్ బలమైన ఆస్తి నాణ్యతను కలిగి ఉంది. ఆర్థికంగా, నికర వడ్డీ మార్జిన్ (NIM)ను కూడా పటిష్టంగా కలిగి ఉంది. అయితే బ్యాంకు చాలా వ్యాజ్యాల్లో నిమగ్నమై ఉండటంతో పాటు ఎల్లప్పుడూ రెగ్యులేటర్ పరిశీలనలో ఉండటం పట్ల ఇన్వెస్టర్లు కొంత జాగ్రత్తగా ఉండాలి. వాల్యుయేషన్ వారీగా IPO చాలా ఆకర్షణీయంగా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యాంకర్ ఇన్వెస్టర్లు వివరాలు..
ఇష్యూ ప్రారంభానికి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.363 కోట్లకు పైగా సేకరించింది. సొసైటీ జనరలీ, నోమురా సింగపూర్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మనీవైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాంకర్ ఇన్వెస్టర్లలో ఉన్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కొక్కటి రూ.510 చొప్పున 71.28 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించాలని కంపెనీ నిర్ణయించింది.

100 ఏళ్ల నాటి బ్యాంక్..
దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన దేశంలోని పురాతన ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ప్రాథమికంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయం, రిటైల్ కస్టమర్లకు విస్తృత శ్రేణి బ్యాంకింగ్, ఆర్థిక సేవలను అందిస్తోంది. మార్చి 2022 నాటికి బ్యాంక్‌కు మెుత్తం 509 శాఖలు ఉన్నాయి. ఇందులో దాదాపు 80 శాతం మంది ఖాతాదారులు ఐదు సంవత్సరాలకు పైగా బ్యాంక్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఐపీవో పూర్తి వివరాలు..
* తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 5, 2022
* తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO ముగింపు తేదీ: సెప్టెంబర్ 7, 2022
* తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO కేటాయింపు: సెప్టెంబర్ 12, 2022
* తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO వాపసు ప్రారంభం: సెప్టెంబర్ 13, 2022
* తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO కేటాయింపు తేదీ: సెప్టెంబర్ 14, 2022
* తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO లిస్టింగ్ తేదీ: సెప్టెంబర్ 15, 2022


Click it and Unblock the Notifications