Wipro News: దేశంలోని టాప్-5 టెక్ కంపెనీల్లో ఒకటిగా విప్రో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా తర్వాతి నుంచి కంపెనీలోని సీనియర్ స్థాయి ఉద్యోగుల వరుస రాజీనామాలు కంపెనీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితులపై ఇన్వెస్టర్లు సైతం భయపడతున్నారు.
తాజాగా కంపెనీ సీఈవో, ఎండీ బాధ్యతలకు థియరీ డెలాపోర్టే రాజీనామా చేయటం టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలకు దారితీస్తోంది. వాస్తవానికి అంతర్జాతీయ వ్యాపార అనిశ్చితులతో టెక్ కంపెనీలు కుదేలవుతున్నాయి. ఈ సందర్భంలో వాటిని విజయవంతంగా ముందుకు నడిపే నాయకత్వం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అయితే విప్రో విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంది. కీలక ఉద్యోగులు కంపెనీని వరుసగా వీడటం సుదీర్ఘంగా కొనసాగటంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

4 ఏళ్ల ప్రయాణం తర్వాత డెలాపోర్టే రాజీనామా చేయటాన్ని అంగీకరించిన విప్రో బోర్డు.. ఆయన స్థానంలో కొత్త సీఈవో, ఎండీగా శ్రీనివాస్ పల్లియాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీనివాస్ తన నాయకత్వంతో కంపెనీని కష్టకాలంలో ఎలా కాపాడతారనే ఆలోచనలు ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నాయి. వాస్తవానికి శ్రీనివాస్ పల్లియా విప్రో అనుభవజ్ఞుడు, మూడు దశాబ్దాలకు పైగా కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఇటీవల అతను అమెరికాస్ 1కి CEOగా పనిచేశారు. శ్రీనివాస్ పల్లియా విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డులో కూడా పనిచేస్తున్నారు.
1992లో విప్రోలో ఉద్యోగిగా చేరిన శ్రీనివాస్ పల్లియా కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా తన కెరీర్ జర్నీని ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో కన్స్యూమర్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్‌తో సహా అనేక నాయకత్వ పదవులను నిర్వహించారు. విద్యార్హతలను పరిశీలిస్తే.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని పొందారు. దీనికి తోడు మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో అడ్వాన్స్‌డ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో గ్లోబల్ లీడర్‌షిప్, స్ట్రాటజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో కోర్సును పూర్తి చేశారు.
సీఈవోగా తనను నియమించటంపై స్పందించిన పల్లియా.. లాభాన్ని ప్రయోజనంతో మిళితం చేసే అరుదైన కంపెనీలలో విప్రో ఒకటని అన్నారు. దిగ్గజ సంస్థకు నాయకత్వం వహించడానికి ఎంపికైనందుకు తాను నిజంగా గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. థియరీ స్థాపించిన బలమైన పునాదిని నిర్మించడానికి, విప్రోను దాని తదుపరి వృద్ధి పథంలో నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వ్యాపారంలో ముందుకు సాగేందుకు తాము సరైన వ్యూహాలను కలిగి ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications