ITR Filing 2024: ప్రజలు తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు చివరి రోజు నేడు. గడువు ముగిసే లోపు పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను పూర్తిచేయటం ఉత్తమం. వాస్తవానికి పన్ను దాఖలు వల్ల ఆర్థికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికీ చాలా మంది పౌరులకు దేశంలో తెలియదు.
ప్రస్తుతం అమలులో ఉన్న ఓల్డ్ టాక్స్ రీజిమ్, న్యూ టాక్స్ రీజిమ్ కింద ప్రజలు తమ పన్ను రిటర్న్ ఫైల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. అయితే ఏది ఎంచుకుంటారనే నిర్ణయం వ్యక్తులకే వదిలేసినప్పటికీ.. డిఫాల్ట్ ట్యాక్స్ రీజిమ్ కింద కొత్త పన్ను పద్ధతిని అమలులో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏడాదికి రూ.లక్ష కంటే ఎక్కువ కరెంటు బిల్లును చెల్లించే వ్యక్తులు, విదేశీ ప్రయాణాలకు ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసిన వ్యక్తులు తప్పనిసరికా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుందని పన్ను చట్టాలు చెబుతున్నాయి. వీటి ప్రకారం రిటర్న్ దాఖలు చేయని వ్యక్తులు పన్ను అధికారుల నుంచి నోటీసులు అందుకునే ప్రమాదం ఉంది.

- మీరు గతంలో చెల్లించిన TDS, TCS తిరిగి పొందాలంటే తప్పనిసరిగా పన్ను రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అలా మీ అర్హత, ఆదాయం ద్వారా చెల్లించాల్సిన పన్నుల లెక్కించిన తర్వాత దీనిని వెనక్కి పొందటానికి కోరవచ్చు. కొందరు వ్యక్తులు సకాలంలో తమ రిటర్న్ ఫైల్ చేయకుంటే పన్ను శాఖ నుంచి నోటీసులతో పాటు అదనపు పన్ను డిమాండ్ లను పొందే ప్రమాదం ఉంటుంది.
- వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు ఐటీఆర్ ఆదాయపు రుజువుగా చూపించేందుకు పనికొస్తుంది. అలాగే ఎవరైనా వ్యక్తులు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు పెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్ వివరాలను సమర్పించాలి. దాని ఆధారంగా మీ ప్రయాణ ఖర్చులతో సహా మీ ఆదాయాన్ని లెక్కించిన తర్వాతే వీసా ప్రాసెస్ చేయబడుతుంది.
- దేశంలోని కొన్ని బీమా సంస్థలు తమ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించటానికి ముందు సదరు వ్యక్తికి ఎంత వరకు కవరేజ్ ఇస్తుంటాయి. ఆదాయ మూలాన్ని నిర్ధారించడానికి ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ రుజువును అడుగుతాయి.
- ముఖ్యంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయటం వ్యక్తులకు మంచి క్రెడిట్ స్కోర్, హిస్టరీనితో పాటు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందటానికి సహాయకారిగా నిలుస్తుంది. క్రెడిట్ కార్డులు, హోమ్ లోన్, కార్ లోన్ వంటి పెద్ద రుణాలను తీసుకోవటానికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను సంప్రదించిన సమయంలో వారు తప్పకుండా రుణగ్రహీతను పన్ను రిటర్న్స్ వివరాలు అడుగుతారు.


Click it and Unblock the Notifications