IPO News: వారంలో బరిలోకి దిగుతున్న ఐపీవో.. ప్రైస్ బ్యాండ్ విడుదల.. పూర్తి వివరాలు..
Yatharth Hospital IPO: బండెనక బండి కట్టి అంటూ పూర్వ కాలంలో ఒక పాటు ఉండేది. ప్రస్తుతం మార్కెట్లో ఐపీవోల రాక కూడా అలాగే ఉంది. అయినా ఇన్వెస్ట్ చేసేందుకు రిటైల్ పెట్టుబడిదారులు ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు.
గతంలో మార్కెట్లోకి వచ్చిన ఐపీవోల్లో షేర్లు ఎలాట్ కాక నిరాశకు గురైన ఇన్వెస్టర్లకు మరో సదవకాశం రాబోతోంది. వచ్చే వారం నుంచి మరో కంపెనీ ఐపీవో మార్కెట్లోకి వస్తోంది. జూలై 26 నుంచి యథార్త్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ లిమిటెడ్ మూలధన సేకరణ కోసం మార్కెట్లోకి వస్తోంది. ఇందులో ఇన్వెస్టర్లు జూలై 28 వరకు పెట్టుబడులు పెట్టవచ్చు.

తాజాగా కంపెనీ ఐపీవో కోసం ఈక్విటీ షేర్లకు ప్రైస్ బ్యాండ్ రూ.285 నుంచి రూ.300 గా నిర్ణయించింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో జూలై 25న ప్రారంభమవుతుంది. IPOలో రూ.490 కోట్ల విలువైన తాజా షేర్లు ఉన్నాయి. దీనికి తోడు ప్రమోటర్లు విమల, ప్రేమ్ నారాయణ్, నీనా త్యాగి ద్వారా 65.51 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంచటం జరుగుతోంది. తాజా ఐపీవో ద్వారా వచ్చే మెుత్తాన్ని కంపెనీ రుణాల చెల్లింపుకు వినియోగించాలని చూస్తోంది. అలాగే రోజువారీ అవసరాలకు వినియోగించనుంది. సంస్థకు నోయిడాలో ఆసుపత్రులు ఉన్నాయి.
ప్రీ ఐపీవో ప్లేస్మెంట్ రూపంలో 40 లక్షల ఈక్విటీ షేర్లను రూ.300 చొప్పున విక్రయించి కంపెనీ ఇప్పటికే రూ.120 కోట్లను సేకరించింది. ప్రస్తుతం ఇష్యూ పరిమాణం రూ.610 కోట్ల నుంచి రూ.490 కోట్లకు తగ్గింది. IPOలో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు(QIB) 50%, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు(NII) 15%, రిటైల్ పెట్టుబడిదారులకు 35% ఆఫర్ రిజర్వ్‌ను కంపెనీ ఉంచింది. కంపెనీ తాజాగా విడుదల చేస్తున్న ఈక్విటీ షేర్లు ఫేస్ వాల్యూ ఒక్కొక్కదానికి రూ.10గా నిర్ణయించింది.


Click it and Unblock the Notifications