IPO News: 2024లో మార్కెట్లోకి ధోనీ, కోహ్లీ కంపెనీల ఐపీవోలు.. టాప్-10 కంపెనీలివే..
2024 IPO's: కొత్త ఏడాదిలో చాలా మంది ఏ కంపెనీలు తమ ఐపీవోలను ఫ్లోట్ చేయనున్నాయనే అన్వేషన కొనసాగిస్తున్నారు. ఇందులో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మద్దతు ఉన్న గరుడ ఏరోస్పేస్, విరాట్ కోహ్లీ మద్దతు కలిగిన గో డిజిట్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
1. ముందుగా ఈ ఏడాది మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారంపై దృష్టి సారించిన ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో రాబోతోంది. కంపెనీ దీనికోసం ఇప్పటికే సెబీ వద్ద DRHPని దాఖలు చేసింది. కంపెనీ ఏకంగా రూ.5,500 కోట్ల మెగా ఐపీవోను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్లాన్ ప్రకారం ఈ ఏడాది మార్కెట్లోకి పబ్లిక్ ఆఫర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2. ఇక హాస్పిటాలిటీ రంగానికి చెందిన ఓయో హోటల్స్ సైతం తన ఐపీవోను మార్కెట్లోకి తీసుకురావాలని పలు ప్రయత్నాలు సైతం చేసింది. అయితే వివిధ కారణాల వల్ల గతంలో చాలాసార్లు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. అయితే రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని హాస్పిటాలిటీ చైన్ ఈ ఏడాది IPOను ప్రారంభించనుందని మార్కెట్‌లో సందడి నెలకొంది.
3. 2024లో ప్రజలకు ముందుకు ఫస్ట క్రై తన ఐపీవోను తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఇష్యూ పరిమాణం మెుత్తంగా రూ.1816 కోట్లుగా ఉండగా ఇందులో ఆఫర్ ఫర్ సేల్ సైతం ఉంటుందని వెల్లడైంది.
4. ఫుడ్ డెలివరీ రంగంలో జొమాటోను ఢీకొడుతున్న స్విగ్గీ ఈ ఏడాది మార్కెట్లోకి అరంగేట్రం చేయాలని నిర్ణయించింది. స్టార్టప్ ఏడాది ద్వితీయార్థంలో ఐపీవో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో చర్చలు ప్రారంభించింది. చివరిగా కంపెనీ మార్కెట్ విలువ 8.5 బిలియన్ డాలర్లని లెక్కించబడింది.
5. డిజిటల్ చెల్లింపుల వ్యాపారంలో ఉన్న పేయూ సైతం 2024నే సరైన సమయంగా ఐపీవో కోసం చూస్తోంది. ఏడాది రెండవ భాగంలో పబ్లిక్ లిస్టింగ్‌కు సిద్ధమౌతోందని తెలుస్తోంది.ఇదే విషయాన్ని కంపెనీ తాత్కాలిక సీఈవో ఎర్విన్ టు పేర్కొన్నారు.
6. ఇప్పుడు మనం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కెప్టెన్ కూల్ మహీంద్రా సింగ్ ధోనీ పెట్టుడులు పెట్టిన డ్రోన్ స్టార్టప్ కంపెనీ గరుడ ఏరోస్పేస్ ఐపీవోని తీసుకురావాలని నిర్ణయించింది. కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించేందుకు ఐపీవో ప్రణాళికలను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ సీఈవో వ్యాఖ్యల ప్రకారం ఇయర్ సెకండ్ హాఫ్ లో ఐపీవో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
7. ఇప్పుడు రాబోతున్నది విరాట్ కోహ్లి మద్దతు గల గో డిజిట్ ఇన్సూరెన్స్ ఐపీవోనే. కంపెనీ తన ఐపీవో ఎంట్రీ కోసం ఇప్పటికే సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్లను సమర్పించింది. ఇందులో రూ.1250 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో పాటు రూ.10.9 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ సైతం ఉన్నట్లు వెల్లడైంది.
8. తాజాగా రెండు రోజుల కిందట ప్రముఖ యూపీఐ పేమెంట్స్ కంపెనీ మెుబీక్విక్ ఐపీవో గురించి కీలక ప్రకటన చేసింది. రానున్న కొద్ది నెలల్లో ఇది ఉండబోతుందని ఈ క్రమంలో కంపెనీ రూ.700 కోట్లను సమీకరించాలని చూస్తోంది.
9. డిజిటల్ చెల్లింపుల సంస్థ PayMate తన IPOను రానున్న 6-8 నెలల్లో ప్రారంభించాలని యోచిస్తోంది. కంపెనీ ఇంతకుముందు తన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయగా సెబీ నుంచి అనుమతి రాలేదని తెలుస్తోంది.
10. ఇక చివరిగా ఈకామర్స్ SaaS ప్లాట్‌ఫారమ్ యూనీకామర్స్ ఈసొల్యూషన్స్ ఇటీవల తన ఐపీవో కోసం ముసాయిదా పేపర్లను సెబీ వద్ద దాఖలు చేసింది. ఈ ఐపీవోలో కంపెనీ తాజా ఈక్విటీ షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద వాటాల విక్రయాన్ని ప్లాన్ చేసింది.


Click it and Unblock the Notifications