Elon Musk: ఎలాన్ మస్క్‌ను కలిసిన భారత యువకుడు.. బిలియనీర్ కి పూణే వాసితో లింకేంటి..?
Elon Musk: ప్రస్తుతం ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ ను కలవటం అన్నది కలలో మాట. అసలు మనలాంటి సామాన్యులకు అలాంటి ఆలోచన కూడా రాదు. అయితే ఆ అవకాశం ఒక భారతీయుడికి దక్కింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇవే..

ఎలాన్ మస్క్ మనస్సులో.1
ఎలాన్ మస్క్ అనే పేరు ప్రస్తుతం ప్రపంచంలో చాలా మందికి పరిచయం అవసరం లేని పేరు. టెస్లా యజమాని అయిన మస్క్ ప్రపంచ కుబేరుల్లో మెుదటి స్థానంలో ఉన్నారు. ఈయన ట్విట్టర్ లో చేసే కామెంట్స్ ప్రపంచాన్నే కుదిపేస్తుంటాయి. తన మనస్సులో ఉన్న ఆలోచనలను మెుహమాటం లేకుండా వెల్లడిస్తుంటారు.
మస్క్‌ను కలిసిన భారతీయుడు..
ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ పక్కడ నిలబడటం అంటే అంత ఆషామాషీ కాదు. అలాంటిది ఆయన పక్కన నిలబడే అవకాశం ప్రణయ్ పాథోలే అనే భారతీయుడికి దక్కింది. 2018 నుంచి ట్విట్టర్‌లో మస్క్‌తో ప్రణయ్ అనుబంధం ఉంది. టెస్లా ఆటోమేటిక్ విండ్‌స్క్రీన్ వైపర్‌ల గురించి, వర్షం పడినప్పుడు దానితో వచ్చే సమస్య గురించి ప్రణయ్ ట్వీట్ చేశాడు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించిన నాటి నుంచి వారు ఒకరితో ఒకరు లింక్ అయ్యారు. ఇద్దరూ డైరెక్ట్ మెసేజెస్ ద్వారా కూడా మాట్లాడుకుంటారు.

పూణే నివాసి..
ప్రణయ్ పాథోలే బిజినెస్ అనలిటిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS) చేశాడు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో కూడా పనిచేశాడు. అతను పూణేలో నివసిస్తున్నాడు. అతను మస్క్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐటి ప్రొఫెషనల్ ఎలాన్ మస్క్‌తో పూర్తి విశ్వాసంతో నిలవడమే దీనికి అతిపెద్ద కారణంగా తెలుస్తోంది.

టెక్సాస్ గిగాఫాక్టరీలో..
బిలియనీర్ అభిమానుల్లో ప్రణయ్ పాథోల్ ఒకరు. టెక్సాస్ గిగాఫాక్టరీలో మస్క్ పక్కన నిలబడి దిగిన ఫొటోను ట్విట్టర్ వేదికగా అతడు పంచుకున్నాడు. మస్క్ తో సమావేశం అద్భుతంగా ఉంది. అతనిలాంటి గొప్ప, ఉదార వ్యక్తిని భూమిపై ఎప్పుడూ చూడలేదు. మస్క్ కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. అంటూ అతడు ట్వీట్ లో వెల్లడించాడు. కలయికకు కారణాలు చెప్పకపోయినప్పటికీ.. టెస్లా గిగాఫ్యాక్టరీ ఒక వారంలో 1,000 మోడళ్లను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే ఇతడు అమెరికన్ బిలియనీర్ తో మంచి స్నేహం ఉన్నట్లు కనిపిస్తోందని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications