Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో చాలా కంపెనీలు ఉంటాయి. కొన్ని కంపెనీలు మాత్రం తమ ఇన్వెస్టర్లను సులభంగా లక్షాధికారులను చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఫార్మా కంపెనీ ఒకటి ఉంది. ఈ కంపెనీ స్టాక్ ఇన్వెస్టర్లను కనుచూపు మేరలో లక్షాధికారులను చేసింది. ఎవరైనా ఈ కంపెనీలో కేవలం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రస్తుతం సదరు ఇన్వెస్టర్ కు దాదాపు 2 కోట్ల రూపాయలు వచ్చేవి.
పైగా ఇప్పుడు కంపెనీ ఇన్వెస్టర్లకు ఉచితంగా షేర్లను ఇవ్వబోతోంది. ఎవరైనా ఈ ఉచిత షేర్లు కావాలనుకుంటే.. వారికి 11 జూలై 2022 వరకు అవకాశం ఉంది. ఎన్ని షేర్లు ఉచితంగా వస్తాయో ఇప్పుడు తెలుసుకోండి..

ఫార్మా కంపెనీ పేరేంటంటే..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ స్టాక్ గురించే. టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ షేర్లు పెట్టుబడిదారులకు చాలా మంచి రాబడిని ఇచ్చింది. కొన్నేళ్లలో కంపెనీ షేర్లు రూ.13 నుంచి రూ.2,900 స్థాయిని దాటింది. ఈ విధంగా టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ స్టాక్ దాదాపు 20,000 శాతం బలమైన రాబడిని అందించింది.
ప్రస్తుతం టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ స్టాక్ ఎన్‌ఎస్‌ఈలో రూ. 1465.45 స్థాయిలో ట్రేడవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 3,304.45గా ఉంది. ఇదే సమయంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 2,485గా ఉంది. అయితే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాదర్ ఈ స్టాక్ గార్గెట్ ధర రూ.3,250 చేరుకుంటుదని అంచనావేసినట్లు తాజాగా వెల్లడించింది.

ఉచిత షేర్ ఎలా పొందాలంటే..
టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ బోనస్ షేర్ ప్రతి షేరుకు ఒక షేరుగా(1:1 రేషియోలో) ఉంటుందని కంపెనీ తెలిపింది. టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ డైరెక్టర్ల బోర్డు 11 జూలై 2022న బోనస్ షేర్ల జారీకి రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. అంటే ఈ లేదీలోపు షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు మాత్రమే ఉచిత షేర్లు అందుతాయి.
2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు 460 శాతం డివిడెండ్ ప్రకటించింది. ఈ డివిడెండ్ ఒక్కో షేరుకు రూ.15గా ఉంది. గత త్రైమాసికంలో కంపెనీ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.25 డివిడెండ్ చెల్లించింది.

ఇన్వెస్టర్లను సంపన్నులుగా మార్చిన కంపెనీ..
టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ తన పెట్టుబడిదారులను అనతికాలంలోనే లక్షాధికారులను చేసింది. 20 ఏప్రిల్ 2001న బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ వాటా రూ.12.65 స్థాయిలో ఉంది. కానీ ప్రస్తుతం దాని విలువ రూ. రూ. 1465.45గా ఉంది. అంటే 10 సంవత్సరాల క్రితం ఈ స్టాక్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినవారికి.. ప్రస్తుతం రూ. 1.15 కోట్లు పొందేవారు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. దీని ఆదారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. మీ ఆర్థిక సలహాదారును సంప్రదించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచం ఉత్తమం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications