Freelance Jobs: ఫ్రీలాన్సర్ గా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? ఈ 5 ఫేమస్ వెబ్‌సైట్ల వివరాలు మీకోసమే..!
Freelance Jobs: కరోనా మహమ్మారి తర్వాత వర్క్ ఫర్మ్ హోమ్ (WFH) కింద ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం పెరుగుతోంది. అయితే ఇదే క్రమంలో చాలా మంది అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తున్నారు. అలాంటి వారికోసమే ఈ వార్త..

ఫ్రీలాన్సింగ్ కు పెరుగుతున్న ఆసక్తి..
పూర్తి-సమయం ఉద్యోగంతో పాటు ఫ్రీలాన్సింగ్ కోసం అనేక మంది పనిచేయటం ప్రస్తుతం మార్కెట్లో ఫేమస్ అయింది. ఐటీ పరిశ్రమలోని అగ్రశ్రేణి యజమానులు, ఉద్యోగులు, హెచ్‌ఆర్ మేనేజర్లు, ఇతర వాటాదారులకు కూడా ఇది పెద్ద సమస్యగా మారింది. వీటిని పక్కన పెడితే.. మీరు కూడా ఇలా ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందటానికి అవకాశం ఉంది. ఫ్రీలాన్స్ ఉద్యోగాలను అందించే 5 ప్రముఖ వెబ్‌సైట్‌ల వివరాలను మేము మీకోసం తీసుకొచ్చాము.

UpWork:
అప్‌వర్క్ అనేది క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫారమ్. ఇది ఫ్రీలాన్స్ సర్వీస్ ప్రొవైడర్లను క్లయింట్‌లతో కలుపుతుంది. సైట్‌లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ వర్క్ తర్వాత 500 డాలర్ల విలువైన పనికి 20 శాతం వరకు అప్-వర్క్ ఫీజు ఉంటుంది. అలాగే 501 డాలర్ల నుంచి 10,000 డాలర్ల మధ్య ఉద్యోగాలకు 10 శాతం రుసుమును వసూలు చేస్తుంది. 10,000 డాలర్ల కంటే ఎక్కువ ఉద్యోగాలకు కేవలం 5 శాతం వరకు ఛార్జీలు ఫ్రీలాన్సర్ల నుంచి వసూలు చేస్తుంది.

Fiverr..
Fiverr రచయితలు, గ్రాఫిక్ డిజైనర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ల వంటి నిపుణులకు ఫ్రీలాన్సింగ్ వర్క్ పొందటంలో సహాయపడుతుంది. కమీషన్ రూపంలో 5 నుంచి 150 డాలర్ల వరకు కంపెనీ వసూలు చేస్తుంది. ఇందుకోసం మీరు ఉచితంగా Fiverr ఖాతాను ప్రారంభించవచ్చు. సర్వీస్ ప్రొవైడర్లు వారి అవసరాలకు అనుగుణంగా వివిధ ధరలలో తమ సేవలను లిస్ట్ చేయవచ్చు. సైట్ ఫ్రీలాన్సర్లకు వినియోగదారులు ఇచ్చిన ర్యాంకుల ఆధారంగా తమ సైట్ లో ప్రాముఖ్యతను ఇస్తుంది.

Guru..
గురు ఫ్రీలాన్సర్‌లకు ఉద్యోగాలు పొందడానికి పెద్ద ఎత్తున సహాయం చేస్తోంది. ప్రతి పనికి 2.9 శాతం కమిషన్ రూపంలో వసూలు చేస్తుంది. ప్లాట్‌ఫారమ్ డాష్‌బోర్డ్ ప్రస్తుత ప్రాజెక్ట్‌లు, పెండింగ్ ప్రాజెక్ట్‌లు, పెండింగ్ అప్లికేషన్‌లు, గడువులు మొదలైనవాటిని ట్రాక్ చేయడానికి ఫ్రీలాన్సింగ్ నిపుణులను అనుమతిస్తుంది.

Freelancer..
ఫ్రీలాన్సర్ అనేది క్లయింట్లు ఫ్రీలాన్స్ టాస్క్‌లపై వేలం వేసే వేదిక. ప్రస్తుతం ఇది 3 శాతం కమీషన్ వసూలు చేస్తోంది. ఫ్రీలాన్సర్లు ప్లాట్‌ఫారమ్‌లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. వారు తమ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత ఖాతాను క్రియేట్ చేసుకోవచ్చు.

People per Hour..
పేరుకు తగ్గట్లుగా.. ఈ ఫ్రీలాన్సింగ్ సైట్ గంటల ప్రాతిపదికన ఉద్యోగాలను అందిస్తుంది. ఇది ఫ్రీలాన్సర్లు, క్లయింట్‌ల మధ్య యాప్‌లో చాట్ చేసుకునేందుకు వెసులుబాటును కూడా కలిగి ఉంటుంది. సంస్థ దీనికోసం ఫ్రీలాన్సర్ల వద్ద నుంచి 5-20 శాతం కమీషన్ వసూలు చేస్తోంది.


Click it and Unblock the Notifications