Dividend Stocks: షేర్లలో పెట్టుబడి పెట్టేవారికి రెండు రకాల ఆధాయాలు ఉంటాయి. ఒకటి పెట్టుబడి సమయంలో కంపెనీ పనితీరు వల్ల షేర్ విలువ పెరగటం వల్ల వచ్చే లాభం. మరొకటి కంపెనీకి వచ్చే ఆర్థిక కార్యకలాపాల వల్ల లాభాల నుంచి ఇన్వెస్టర్లకు చెల్లించే డివిడెండ్ ఆధాయం. దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఎక్కువగా గ్రోత్ తో పాటు మంచి డివిడెండ్ అందించే వాటి కోసం ఎక్కువగా వెతుకుతుంటారు.
అలాంటి వారికి కొన్ని కంపెనీలు ఉన్నాయి. HDFC సెక్యూరిటీస్ అందించిన వివరాల ప్రకారం.. మార్కెట్లు పడిపోతున్న సమయంలోనూ ఈ 10 కంపెనీల స్టాక్స్ అధిక డివిడెండ్ చెల్లించాయి. డివిడెండ్ పొందటానికి ఇన్వెస్ట్ చేయటం అనే వ్యూహం కూడా పెట్టుబడిదారులకు మ్యాజిక్ లాగా పని చేస్తుంది. దీని వల్ల క్రమ పద్ధతిలో పెట్టుబడులపై రాబడి కూడా ఉంటుంది. వీటిలో ఎక్కువ శాతం ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటం ఇక్కడ విశేషం.
1. REC: ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సంస్థ REC అత్యధికంగా 13.8 శాతం డివిడెండ్ రాబడిని అందించింది. రూ.10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక్కో షేర్ కు కంపెనీ 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.15.30ల డివిడెండ్ చెల్లించింది.
2. SAIL: స్టీల్ ఉత్పత్తి విభాగంలోని ప్రభుత్వ కంపెనీ అయిన SAIL 13.5 శాతం డివిడెండ్ అందించింది. FY22లో కంపెనీ 87.5% డివిడెండ్‌ను చెల్లించింది. ఒక్కో షేర్ కు రూ.30.30 ఈపీఎస్ కలిగి ఉంది.

3. Power Finance Corporation: PFC అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ ఫైనాన్స్ సంస్థ. ఇది 12.2% డివిడెండ్ రాబడిని అందిస్తోంది. PFC అనేది REC మాతృ సంస్థ. ఒక్కో షేర్ కు రూ.53.10 ఈపీఎస్ కలిగి ఉంది. FY22 ఆర్థిక సంవత్సరంలో PFC తన వాటాదారులకు 120% డివిడెండ్ ఇచ్చింది.
4. PTC India: ఈ పవర్ ట్రేడింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ప్రభుత్వ రంగ సంస్థ 10.4% డివిడెండ్ రాబడిని అందిస్తుంది. FY22లో కంపెనీ 75% డివిడెండ్ ఇచ్చింది. ఇది ప్రస్తుతం ఒక్కో షేరుకు రూ. 14.7 EPS కలిగి ఉంది.
5. Coal India: ఈ ప్రభుత్వ యాజమాన్యం ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా ఉంది. ఇది 9.6 శాతం డివిడెండ్ దిగుబడిని అందిస్తోంది. ఇది ఆర్థిక సంవత్సరం FY22లో 170 శాతం డివిడెండ్‌ను చెల్లించింది. దీని ఈపీఎస్ ఒక్కో షేరుకు రూ. 28.20గా ఉంది.

6. Housing and Urban Development Corporation (HUDCO): ఈ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ విభాగంలో టెక్నో-ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది. ఇది 8.5 శాతం డివిడెండ్ రాబడిని అందిస్తుంది. ఇది ఒక్కో షేరుకు రూ. 8.6 EPS కలిగి ఉంది. FY22 ఆర్థిక సంవత్సరంలో.. కంపెనీ తన వాటాదారులకు 27.5 శాతం డివిడెండ్‌ను చెల్లించింది.
7. PNB Gilts: ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్-మద్దతుగల కంపెనీ ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ సంస్థాగత మౌలిక సదుపాయాలలో డీలర్. ఇది 8.5 శాతం డివిడెండ్ రాబడిని కూడా అందిస్తోంది. కంపెనీ ఈపీఎస్ రూ.8.90గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో.. కంపెనీ తన వాటాదారులకు 50% డివిడెండ్‌ను చెల్లించింది.
8. Indian Oil: ఒక్కో షేరుకు రూ.26.7 EPSతో ₹9,414.2 కోట్ల చెల్లింపు మూలధనాన్ని కలిగి ఉన్న ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ 8.2 శాతం డివిడెండ్ రాబడిని అందిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో.. కంపెనీ తన వాటాదారులకు 84 శాతం డివిడెండ్‌ను చెల్లించింది.

9. ONGC: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ గ్యాస్ అన్వేష, ఉత్పత్తిదారుగా ONGC ఉంది. ఇది పెట్టుబడిదారులకు 7.8 శాతం డివిడెండ్ రాబడిని ఇస్తోంది. ప్రస్తుతం.. PSU పెయిడ్-అప్ ఈక్విటీ మూలధనం విలువ రూ. 6,290.1 కోట్లతో ఒక్కో షేరుకు రూ. 37.4 ఈపీఎస్ కలిగి ఉంది. FY22 ఆర్థిక సంవత్సరంలో ONGC భారీగా 210 శాతం డివిడెండ్‌ను చెల్లించింది.
10. Rites: భారతీయ రైల్వేల మద్దతు గల రైట్స్ రవాణా రంగంలో ప్రత్యేకత కలిగి ఉంది. కంపెనీ 7.5 శాతం డివిడెండ్ రాబడిని అందిస్తుంది. ఇది ఒక్కో షేరుకు రూ. 21.5 ఆదాయంతో రూ. 240.3 కోట్ల పెయిడ్-అప్ ఈక్విటీ క్యాపిటల్‌ను కలిగి ఉంది. FY22లో.. కంపెనీ తన వాటాదారులకు 170 శాతం డివిడెండ్‌ను చెల్లించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications