For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Top-10 Jobs: 2022లో అత్యధిక జీతాలు వీరికే.. ఏడాదికి లక్షల్లో వేతనాలు.. మీకూ ఈ స్కిల్స్ ఉన్నాయా..?

|

Top-10 High Paid Jobs: చదువు పూర్తయ్యాక మంచి జీతంతో ఉద్యోగం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికీ మంచి జీతంతో కూడిన ఉద్యోగం వస్తుందా? ఉంటే అనుమానమే. చాలా మందికి చదువుకు సరిపడే ఉద్యోగం రాక, వచ్చిన ఉద్యోగానికి ఎందుకు వెళ్లడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం దేశంలో ఏ ఉద్యోగాలకు ఎక్కువ జీతం, డిమాండ్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

 సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్..

సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్..

సాధారణంగా ఐటీ రంగంలో ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ రంగంలో అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువ కానుందని తెలుస్తోంది. ముఖ్యంగా.. కోడింగ్, వెబ్ డిజైనింగ్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ స్కిల్స్ ఉన్నవారికోసం అవకాశాలు పెరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ కావడానికి మీరు కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. దీని కోసం HTML, Javascript, C++ లలో ప్రావీణ్యం అవసరం. ప్రారంభ వేతనం రూ.9 లక్షల నుంచి గరిష్ఠంగా సగటు వార్షిక వేతనం రూ.24 లక్షల వరకు వివిధ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.

 సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్..

సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్..

సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ వ్యాపారాలు సమస్యలను గుర్తించడంలో, వాటికి పరిష్కారాలను అందించడంలో సహాయపడుతుంది. సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కావడానికి మీరు కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఈ పోస్టుకు ప్రారంభ వేతనం మార్కెట్లో ఏడాదికి రూ.5 లక్షలుగా ఉంది. అదే సగటు జీతం రూ.20 లక్షలు ఉండగా గరిష్ఠంగా రూ.26 లక్షల వరకు చెల్లంచేందుకు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి.

కమర్షియల్ పైలట్..

కమర్షియల్ పైలట్..

పైలటింగ్ చాలా మంది ఎంపిక చేసుకునే వృత్తి. కమర్షియల్ పైలట్ జాబ్ మీకు కొత్త అనుభవాన్ని అందించగలదు. కమర్షియల్‌ పైలట్‌ కావాలంటే సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు పైలట్ లైసెన్స్ తప్పనిసరి. ఇక్కడ ప్రారంభ వేతనం 15 లక్షల రూపాయల నుంచి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు ఉంటుంది.

మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌..

మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌..

మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌లు కంపెనీల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. వారు సంస్థ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడతారు. మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా మారడానికి వ్యాపారంలో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ (ఎకనామిక్స్, ఫైనాన్స్ లేదా అకౌంటింగ్‌లో ప్రత్యేకత) అవసరం. వారి ప్రారంభ వేతనం సంవత్సరానికి రూ.7 లక్షల ఉంటుంది. అనుభవం ఉన్నవారికి ఏడాదికి రూ.23 లక్షలకు కంపెనీలు చెల్లిస్తున్నాయి.

జనరల్ సర్జన్..

జనరల్ సర్జన్..

డాక్టర్ కావాలనేది చాలా మందికి కల. అయినప్పటికీ.. జనరల్ సర్జన్ అత్యధిక వేతనం పొందే ఉద్యోగాల్లో ఒకటిగా ఉంది. జనరల్ సర్జన్ కావాలంటే MBBSతో పాటు తగిన శిక్షణ ఉండాలి. ఇది కాకుండా ఎంఎస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వారికి ప్రారంభ వేతనం రూ.11 లక్షల ఉండగా.. అనుభవం ఉన్న వారికి ఏడాదికి రూ.24 లక్షల వరకు పొందుతారు.

డేటా సైంటిస్ట్..

డేటా సైంటిస్ట్..

ప్రస్తుత కాలంలో అత్యధిక డిమాండ్ కలిగి ఉన్న ఉద్యోగాల్లో ఇది కూడా ఒకటి. డేటా సైంటిస్టులు దేశంలో అత్యధిక వేతనం పొందే ఉద్యోగుల్లో ఉన్నారు. సాంకేతికతలోని పోకడలను పర్యవేక్షిస్తారు. డేటాను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగానికి ప్రారంభ వేతనం దాదాపు రూ.6 లక్షలుగా ఉంది. సగటు జీతం సంవత్సరానికి రూ.9 లక్షలు ఉండగా.. అనుభవం తర్వాత జీతం ఏడాదికి రూ.20 లక్షల వరకు ఉంటుంది.

డేటా ఇంజనీర్..

డేటా ఇంజనీర్..

డేటా ఇంజనీర్లు B.Tech లేదా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత కోర్సులు) పూర్తిచేసి ఉండాలి. వారికి ప్రారంభ జీతం రూ.5 లక్షల నుంచి మొదలవుతుంది. ఆ తరువాత ఆ అనుభవాన్ని బట్టి రూ.20 లక్షల వరకు ఉంటుంది.

 చార్టర్డ్ అకౌంటెంట్..

చార్టర్డ్ అకౌంటెంట్..

చార్టర్డ్ అకౌంటెంట్ కష్టతరమైన పరీక్షల్లో ఒకటి. అయితే.. దీనికి జీతం కూడా ఎక్కువే. వారి జీతం ప్రారంభంలో సంవత్సరానికి సుమారు రూ.7 లక్షలు ఉంటుంది. వారు అనుభవం, ఇతర మెట్రిక్స్ ఆధారంగా కంపెనీలు ప్రస్తుతం గరిష్ఠంగా ఏడాదికి రూ.20 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి.

ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్..

ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్..

పెట్టుబడి సలహాదారులు మార్కెట్ పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారు. వీరు ఇన్వెస్టర్లకు పెట్టుబడుల విషయంలో సహాయం చేస్తుంటారు. ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లేదా ఇతర సంబంధిత రంగంలో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. వారి జీతం ప్రారంభంలో రూ.6 లక్షల నుంచి అనుభవం తర్వాత రూ.25 లక్షల వరకు ఉంది.

 కార్పొరేట్ లాయర్..

కార్పొరేట్ లాయర్..

కార్పొరేట్ న్యాయవాది అనేది నేటికీ అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగాల్లో ఒకటిగా ఉంది. ఇందుకోసం ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ఉండాలి. ప్రారంభంలో నెలకు రూ.6 లక్షల జీతం పొందుతారు. అదే అనుభవాన్ని బట్టి ఏడాదికి రూ.12 లక్షల వరకు కంపెనీలు చెల్లిస్తున్నాయి.

English summary

know about these top 10 salary paying jobs in 2022 from software to ca in india

know about these top 10 salary paying jobs in india
Story first published: Saturday, August 13, 2022, 17:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X