Festival Stocks: పండుగల సీజన్లో బట్టలు, వస్తువులు, బంగారు ఆభరణాలు.. ఇలా అనేక వ్యాపారులు మంచి లాభాలను ఆర్జిస్తారని మనందరికీ తెలిసిందే. అయితే ఇలా పండుగ సీజన్ లో లాభాల వర్షం కురింపించే స్టాక్ ఉంటాయని స్టాక్ మార్కెట్లో రెగ్యులర్ గా పెట్టుబడులు పెట్టే వారికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఈ వివరాలను మీరు కూడా తప్పకుండా తెలుసుకోండి.

లాంగ్ ఫెస్టివల్ సీజన్..
ఆగష్టు నుంచి మెుదలై డిసెంబర్ వరకు కొనసాగే పండుగల సీజన్ రావడంతో వ్యాపారుల్లో ఇప్పటికే జోష్ నెలకొంది. తమ ఉత్పత్తులు, సేవలకు అధిక డిమాండ్‌ను చూసే కంపెనీలకు బిజినెస్ పెరగటంతో పాటు, వాటి షేర్ ధర కూడా పెరుగుతుంది.

పండుగలకు ఏవి కొంటారంటే..
రక్షా బంధన్, గణేష్ చతుర్థి, నవరాత్రి, దీపావళి, దసరా వంటి పండుగల సమయంలో భారతీయులు సాధారణంగా ఆటోమొబైల్స్, అపార్ట్‌మెంట్స్ వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పండుగతో పాటు దగ్గరలోనే ఉన్న పెళ్లిళ్ల సీజన్ కారణంగా దుస్తులు, గడియారాలు, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి కోసం షాపింగ్ చేస్తుంటారు.

FMCG స్టాక్స్..
ఈ సీజన్‌లో స్వీట్లు, చాక్లెట్స్, స్నాక్స్‌లకు భారీగా డిమాండ్ ఉంటుంది. దీనివల్ల ఎఫ్‌ఎంసీజీ కంపెనీల స్టాక్‌లు ఉత్తమ పనితీరును కనబరుస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. హల్దిరామ్స్ వంటి దిగ్గజ కంపెనీలు అధిక డిమాండ్ కలిగి ఉంటాయి.

ఫోకస్ స్టాక్స్ ఇవే..
పండుగల సీజన్లో ఇన్వెస్టర్లు పరిగణలోకి తీసుకోవలసిన సాక్స్ లో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, బ్యాంకింగ్ స్టాక్స్ కొన్ని అని ప్రొఫిషియెంట్ ఈక్విటీస్ డైరెక్టర్ మనోజ్ దాల్మియా చెప్పారు.పెళ్లిళ్ల సీజన్ కారణంగా మన్యవర్, రేమండ్ వంటి స్టాక్‌లతో పాటు డిమార్ట్, షాపర్స్ స్టాప్ కూడా లైమ్‌లైట్‌లో ఉంటాయని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బథిని వెల్లడించారు.

గత సంవత్సరం లాభాలు..
గత సంవత్సరం పండుగ సీజన్లో కొన్ని స్టాక్స్ మంచి పనితీరును కనబరిచాయి. టాటా మోటార్స్ (59%), M&M (60%), మారుతీ సుజుకి (26%), టైటాన్ (34%), డిమార్ట్ (18%), షాపర్స్ స్టాప్ ( 159%), మాన్యవర్ (27%), రేమండ్ (127%) అత్యధిక రాబడిని అందించిన పండుగ స్టాక్‌లుగా నిలిచాయి. ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ 2022లో దేశంలో వినియోగం పెరుగుతుందని ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది.
Note: పైన అందించిన వివరాల ఆధారణంగా ఎలాంటి ట్రేడింగ్ చేయకండి. మీ ఆర్థిక సలహాదారు సలహాలను పాటించండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications