Arvind Swamy: మనందరికీ అరవింద స్వామి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆయన నటించిన బొంబాయి, రోజా సినిమాలే. అయితే ఆయనొక విజయవంతమైన వ్యాపారవేత్త అనే సంగతి మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
1991లో అరవింద స్వామి సినీ ప్రస్థానం మణిరత్నం దళపతి సినిమాతో మెుదలైంది. ఆ తర్వాత 1992లో వచ్చిన రోజా, 1995లో వచ్చిన బొంబాయిలు సినీ పరిశ్రమలో పెద్ద పెరును తెచ్చిపెట్టాయి. అయితో 90ల చివర్లో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రాణించకపోవటంతో 2000 సంవత్సరంలో నటన నుంచి తప్పుకున్నారు.

అలా తొలుత తన తండ్రికి చెందిన VD Swamy and Company వ్యాపారాన్ని నిర్వహించేవాడు. ఆ తర్వాత 2005లో మరో అడుగు ముందుకేసి టాలెంట్ మ్యాక్సిమస్ అనే పేరోల్ ప్రాసెసింగ్, టెంపరరీ వర్కర్స్ అందించే సేవల కంపెనీని ప్రారంభించి విజయాన్ని సాధించారు. అరవింద స్వామి నేతృత్వంలో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. అలా ఒక సినీ నటుడిగా ప్రారంభమైన కెరీర్ చివరికి ఒక వ్యాపారవేత్తగా మలుపు తిరిగింది.
2022 నాటికి స్వామి ఆధ్వర్యంలోని టాలెంట్ మాగ్జిమస్ 418 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం.. రూ.3,300 కోట్లు అద్భుతమైన ఆదాయాన్ని సాధించింది. విజయవంతమైన వ్యాపారవేత్తగా అతని ఖ్యాతిని పటిష్టం చేసింది. కెరీర్ సవాళ్లను ఎదుర్కొంటున్న నటుడి స్థాయి నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఈ అద్భుతమైన పరివర్తన స్వామి స్థితిస్థాపకత, బహుముఖ ప్రజ్ఞను హైలైట్ చేస్తుంది. తన నట జీవితంలో అడ్డంకులు ఉన్నప్పటికీ, వ్యాపార ప్రపంచంలో అరవింద స్వామి ప్రయాణం వెండితెరను దాటి విజయానికి కొత్త అద్దం పట్టింది.


Click it and Unblock the Notifications