Success Story: షేర్ మార్కెట్ అనేది చాలా మందికి ఒక దయ్యంలా కనిపిస్తుంటుంది. కానీ.. దాని గురించి బాగా తెలుసినవారికి, దానితో బాగా పరిచయం ఉన్న వారికి మాత్రం అదొక అద్బుతంగా భావిస్తుంటారు. మార్కెట్ల పనితీరు గురించి అర్థం చేసుకుంటే దానిని మీ కలలు నెరవేర్చుకోవటానికి సరిగ్గా ఉపయోగపడుతుంది.
ఈ మాటలు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా.. ఒక సాధారణ మహిళ జీవితంలో ఇది జరిగిందని మీరు తెలుసుకుంటే తప్పక నమ్ముతారు. అవును ట్రేడింగ్ ద్వారా ఆ అమ్మాయి ప్రపంచ యాత్రలు చేయాలన్న తన కలను నెరవేర్చుకుంటోంది. ఇప్పటికే సగం ప్రపంచాన్ని చుట్టేసింది కూడా.. ఆమె సక్సెస్ స్టోరీని మీరు తెలుసుకోండి..

బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి.. స్టాక్ మార్కెట్ వైపు
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఒకవిధంగా చెప్పాలంటే జూదం కంటే తక్కువ కాదంటోంది రాజర్షిత. చాలా మంది మరింత ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశలో.. తమ సంపాదన మొత్తాన్ని కోల్పోతుంటారని ఆమె అంటున్నారు. మంచి శాలరీ అందించే బ్యాంక్ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా..? అవును ప్రపంచంలో ఇలాంటి వారు కూడా ఉంటారు. కోల్‌కతా నివాసి అయిన రాజర్షితా సూర్ కథ కూడా అలాంటిదే. ప్రపంచాన్ని చుట్టిరావాలనేది రాజర్షిత కల. అందుకే బ్యాంకర్ ఉద్యోగం గురించి పట్టించుకోలేదు. సూర్ కలను నెరవేర్చుకోవడానికి షేర్ మార్కెట్ ఉపయోగపడింది.

అదృష్టాన్ని పరీక్షించుకోవాలని
రాజర్షిత సూర్‌కి ముంబైలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ట్రెజరీ విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఆమెకు ఉద్యోగంలో ప్రత్యేకించి ఎటువంటి సమస్య లేదు. ఖర్చుల టెన్షన్ లేకుండా ఆఫీస్ టైమ్‌తో ముడిపెట్టి, సరిపడా డబ్బు సంపాదించే పని ఏదైనా ఉండాలని ఆమె కోరుకుంది. ఆమె బ్యాంక్‌లో ఫారెక్స్ ట్రేడింగ్‌ను చూస్తుండేది. దీంతో ఆమె స్టాక్ మార్కెట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది.

స్టాక్ మార్కెట్ అలా మొదలైంది
బ్యాంకు ఉద్యోగం మానేసిన తర్వాత.. రాజర్షిత సుర్ సొంతంగా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం ప్రారంభించింది. తొలినాళ్లలో.. మూడు సంవత్సరాల పాటు ఈక్విటీ ట్రేడర్ గా ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసింది. ఈ ఉద్యోగంతో పాటు ఆమె తన ట్రేడింగ్ కూడా కొనసాగించింది. క్రమంగా రాజర్షిత స్టాక్ మార్కెట్ ను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. మంచి ఫండ్ కూడా సంపాదించింది. అప్పుడు ఏమైందో ఏమో తను కూడా ఈ జాబ్ వదిలేసి ప్రపంచాన్ని చుట్టేయటం ప్రారంభించింది.

ప్రపంచంలోని ఈ ప్రాంతాలను సందర్శించారు:
ఈరోజు రాజర్షిత సూర్ పెట్టుబడి గురువుగా మంచి గుర్తింపు పొందారు. ఆమె స్టాక్ మార్కెట్‌లో ఎనిమిదేళ్లుగా ట్రేడింగ్ చేస్తోంది. రాజర్షిత సుర్ ఇప్పటి వరకు బ్రిటన్, టర్కీ, ఆగ్నేయాసియాతో పాటు దాదాపు 70 శాతం యూరప్‌లో పర్యటించింది. నేపాల్ పర్యటన పూర్తి చేసుకున్న ఆమె ఇప్పుడు కెన్యా, ఐస్ లాండ్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాజర్షిత విదేశాలకు పర్యటించేందుకు ప్రతి సంవత్సరం కనీసం రూ. 10 లక్షలు కేటాయించుకుంటుంది. ట్రేడింగ్ ద్వారా ప్రతి నెలా 3-4 శాతం లాభాలు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది. ఈ లక్ష్యం చేరిన వెంటనే.. ఆమె ట్రేడింగ్ నిలిపివేసి యాత్రలు చేస్తుంటుంది.

షేర్ మార్కెట్ జూదం కంటే తక్కువ కాదు
రాజర్షిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా ఆమెకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని బయోలోనే.. ఫరెవర్ ఆన్ వెకేషన్ అని రాసుకుంది ఆమె. ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఆమె విదేశీ పర్యటనలకు సంబంధించిన డజన్ల కొద్దీ చిత్రాలను అప్‌లోడ్ చేసింది. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు సంబంధించి రాజర్షిత జూదం కంటే తక్కువ కాదని అంటున్నారు.
చాలా మంది మరింత ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశలో.. సంపాదన మొత్తాన్ని కోల్పోతుంటారని తెలిపారు. ఇలాంటి వారు మరింత సంపాదించడానికి F&O ట్రేడ్ (ఫ్యూచర్ & ఆప్షన్స్)లో కూడా డబ్బు కోల్పోతుంటారని వెల్లడించారు. అయితే.. ఇలాంటి తప్పుల నుంచి గుణపాటాలు నేర్చుకున్న ఆమె ట్రేడింగ్ కంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ఉత్తమమని అంటున్నారు. దానిపైనే ఆమె ఇప్పుడు ఎక్కువ దృష్టి పెడుతోంది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications