D-Mart: రాధాకిషన్ దమానీ అంటే దేశీయ స్టాక్ మార్కెట్లలో తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆయన దివంగత బిగ్ బుల్ గురువు. విజయవంతమైన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్. పైగా ప్రస్తుతం ఆయన స్థాపించిన డీమార్ట్ సూపర్ మార్కెట్లు దేశంలో విపరీతంగా పాపులర్ అయ్యాయి. వీటిని ఆయన అవెన్యూ సూపర్ మార్కెట్ పేరుతో నిర్వహిస్తున్నారు.
తాజాగా ఇండియాకు చెందిన ఫోర్బ్స్ జాబితాలో సంపన్నుడిగా 8వ స్థానంలో నిలిచారు. అతను ఒక గది ఇంటి నుంచి గ్రాడ్యుయేషన్‌ను సగంలోనే నిలిపేసిన స్థాయి నుంచి రోజూ కోట్లు సంపాదించే స్థాయికి ఆయన చేరుకున్నారు. దీనికి కారణం ఆయన సొంత పెట్టుబడి సంస్థ బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా సంపాదిస్తున్న లాభం. ఆయన మెుత్తం ఆస్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లుగా ఉంది.

ముంబై విశ్వవిద్యాలయం నుండి తన B.Com చదువు మధ్యలోనే ముగించి.. తండ్రికి వ్యాపారంలో సాయం చేయటం ప్రారంభించారు. తండ్రి మరణం తర్వాత స్టాక్ బ్రోకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఇన్వెస్టర్‌గా మారారు. ట్రేడింగ్‌లో గొప్ప లాభాలను సంపాదించారు. 1990ల చివర్లో మార్కెట్ నుంచి రిటైల్ రంగానికి మారారు. మొదట నవీ ముంబైలోని అప్నా బజార్ ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు.
దమానీ.. సెంచురీ సిల్క్స్, ఇండియన్ సిమెంట్, VST ఇండస్ట్రీస్, TV టుడే నెట్‌వర్క్, బ్లూ డార్ట్, సుందరం ఫైనాన్స్, 3M ఇండియా వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. ఇప్పటికీ ఆయన పోర్ట్ ఫోలియోను చాలా మంది ఇన్వెస్టర్లు గమనిస్తూ అనుకరిస్తూనే ఉంటారు.
తొలి డీమార్ట్ స్టోర్ 15 మే 2002న ముంబైలోని పోవైలో ప్రారంభించారు. ఇంతితై వటుడింతై అన్నట్లుగా ప్రస్తుతం ఈ సూపర్ మార్కెట్స్ దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, NCR, తమిళనాడు, పంజాబ్ మరియు రాజస్థాన్‌లకు విస్తరించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 306 స్టోర్లను డీమార్ట్ కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ.10,300 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని నమోదు చేసి మెుత్తంగా రూ.589 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


Click it and Unblock the Notifications