IPO News: ఈ వారం మార్కెట్లోకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 ఐపీవోలు వస్తున్నాయి. వీటిలో 3 మెయిన్ స్ట్రీమ్ ఐపీవోలు కాగా.. నాలుగు ఎమ్ఎస్ఎమ్ఈ కేటగిరీ కింద వస్తున్నాయి.
ముందుగా సెన్‌కో గోల్డ్ లిమిటెడ్ ఐపీవో గురించి తెలుసుకుందాం. దేశ వ్యాప్తంగా రిటైల్ జ్యువెలరీలో వ్యాపారం కలిగిన కంపెనీ 1994లో స్థాపించబడింది. "సెంకో గోల్డ్ & డైమండ్స్" బ్రాండ్ పేరుతో బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినంతో పాటు విలువైన రాళ్లతో సహా రకరకాల ఆభరణాలను విక్రయిస్తోంది. జూలై 4న ప్రారంభమౌతున్న ఈ ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.301-రూ.317గా ఉంది. ప్రస్తుతం గ్రేమార్కెట్ ప్రీమియం రూ.102 వద్ద కొనసాగుతోంది. ఐపీవో నిధులను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. మార్చి 2023 నాటికి కంపెనీ మొత్తం ఆస్తులు రూ.2,905.32 కోట్లు, ఆదాయం రూ.4,108.54 కోట్లు, నికర లాభం రూ.158.48 కోట్లుగా ఉంది.

ఇక రెండవ మేజర్ ఐపీవో సినోప్టిక్స్ టెక్నాలజీస్ జూన్ 30 నుంచి జూలై 5 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడింది. 2008లో ప్రారంభమైన కంపెనీ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్, క్లౌడ్ సర్వీసెస్, IT సెక్యూరిటీ సొల్యూషన్స్, డేటా సెంటర్ డిజైన్‌లను అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కంపెనీ ప్రభుత్వ సంస్థలు, TATA కమ్యూనికేషన్స్, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్, షాపర్స్ స్టాప్ లిమిటెడ్, హెన్నెస్ & మారిట్జ్ (H&M), గుజరాత్ ప్రభుత్వంతో సహా అనేక క్లయింట్‌లకు సేవలను అందిస్తోంది. ప్రైవేట్ LTE/ప్రైవేట్ 5G సేవల కోసం ఇటీవల BSNLతో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసింది. రూ.54.03 కోట్ల సమీకరణ కోసం ఇష్యూ ధరను రూ.237గా నిర్ణయించింది.
ఐపీవోలో ఇన్వెస్ట్ చేయటం అంటే ఏదైనా ఇతర వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లే. కాబట్టి మీరు IPOలో ఇన్వెస్ట్ చేసే ముందు.. కంపెనీ ఫండమెంటల్స్, దాని భవిష్యత్తు అవకాశాలను తప్పక తనిఖీ చేయండి. కంపెనీ వ్యాపార వ్యూహాలతో పాటు దాని నిర్వహణ, వ్యవస్థాపకుల పనితీరు వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత తప్పకుండా ఇవ్వాలి. అలాగే సదరు వ్యాపారం గురించి 360-డిగ్రీల వీక్షణను కలిగి ఉన్న తర్వాత మాత్రమే ముందుకెళ్లి ఒక ఐపీవోలో ఇన్వెస్ట్ చేయటం మంచిది.


Click it and Unblock the Notifications