కొత్త నెల ప్రారంభంతోనే అనేక అంశాల్లో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో లైఫ్ సర్టిఫికేట్, ఆధార్ అప్‌డేషన్‌తో పాటు ఇతర అంశాలకు సంబంధించి కీలక మార్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బల్క్ సిమ్ విక్రయాలకు సంబంధించి కొత్త రూల్ ప్రకారం పూర్తి KYC లేకుండా ఏ దుకాణదారుడు ఎవరికీ SIM విక్రయించటం కుదరదు. ఒక్కో ఐడీపై పరిమిత సంఖ్యలోనే సిమ్ కార్డులు జారీ చేయబడతాయి. సిమ్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం దీనిని ప్రవేశపెట్టింది. నిబంధనలు పాటించకుంటే రూ.10 లక్షల జరిమానా, జైలు శిక్ష విధించబడుతుంది. ఇదే క్రమంలో యూపీఐ ఐడీలపై ఎన్పీసీఐ కీలక నిర్ణయం చేసింది. ఒక ఏడాది కాలంగా ఇన్‌యాక్టివ్ గా ఉన్న యూపీఐ ఐడీలను డిసెంబర్ 31లోపు డీయాక్టివేట్ చేయాలని అన్ని యూపీఐ సర్వీస్ ప్రొవైడింగ్ యాప్స్, బ్యాంకులకు స్పష్టం చేసింది.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని నవంబర్ నెలాఖరులోపు సమర్పించాలి. ఇలా చేయకపోతే వారికి చెల్లించే పింఛన్ నిలిచిపోతుంది. అందువల్ల ఇది పూర్తి చేయని వారిని డిసెంబర్ నెల నుంచి ఫించన్ హోల్డ్ చేయబడుతుంది. డిసెంబర్ నుంచి బ్యాంక్ లాకర్ విషయంలోనూ కీలక పరిణామాలు ఉన్నాయి. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ 31, 2023 నాటికి బ్యాంకులు సవరించిన లాకర్ ఒప్పందాన్ని క్రమపద్ధతిలో అమలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం లాకర్ హోల్డర్లు అప్‌డేట్ చేయబడిన లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేసి సమర్పించాల్సి ఉంటుంది.
ఇక పెట్టుబడులకు సంబంధించిన విషయంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ఒక ముఖ్యమైన పరిణామం కూడా ఉంది. డీమ్యాట్ ఖాతాదారులు తమ నామినేషన్ ప్రక్రియను డిసెంబర్ 31, 2023లోపు పూర్తి చేసేందుకు గడువును పొడిగించటం జరిగింది. దీని ప్రకారం గడువులోపు పాన్, నామినేషన్, సంప్రదింపు చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు, నమూనా సంతకాన్ని సమర్పించకపోతే ఫోలియోలు స్తంభింపజేయబడతాయని సెబీ ఇంతకుముందు తెలిపింది.
గడచిన 10 ఏళ్లుగా తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయని వ్యక్తులు వాటిని ఉచితంగా చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకు UIDAI వెసులుబాటు కల్పించింది. ఆధార్ మోసాలను నిరోధించేందుకు వీలుగా పాత ఆధార్ వివరాలను తాజా సమాచారంతో అప్‌డేట్ చేయాలని ప్రజలను కోరుతోంది. ఇక చివరిగా మారిన రూల్ రుణాలకు సంబంధించినది. హౌసింగ్ లోన్ విషయంలో రుణాన్ని చెల్లించిన వెంటనే బ్యాంకులు సదరు పత్రాలను సకాలంలో బ్యాంకులు తిరిగి ఇవ్వకపోతే నెలకు రూ.5 చొప్పున జరిమానా చెల్లించాలని రిజర్వు బ్యాంక్ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఒకవేళ పత్రాలు మిస్ అయితే అందుకు అదనంగా 30 రోజులు గడువు ఇవ్వబడుతుంది.


Click it and Unblock the Notifications