August 1st Changes: ప్రతి నెల కొన్ని గమనించాల్సిన మార్పులు ఉంటూనే ఉంటాయి. ఇవి ప్రత్యక్షంగా మన ఆదాయం, ఖర్చులపై ప్రభావాన్ని చూపుతుంటాయి. వాటిని తప్పకుండా మనం గమనించాల్సి ఉంటుంది.
ముందుగా అందరూ ఎదురుచూసేది ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పుల గురించే. ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. గత నెల జూలై 4న చమురు సంస్థలు గ్యాస్ ధరలను సవరిస్తూ కమర్షియల్ సిలిండర్ పై రూ.7 పెంపును ప్రకటించాయి. అయితే ఈసారి ఎలాంటి ప్రకటన వస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

రెండవది ఐటీఆఫ్ ఫైలింగ్ తేదీ. 2022-23 అసెస్మెంట్ సంవత్సరానికి పన్ను రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31, 2023. అయితే ఈ తేదీ నాటికి రిటర్స్ ఫైలింగ్ పూర్తి చేయని వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులకు రూ.1000, రూ.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండే వారికి రూ.5,000 ఆలస్య రుసుము విధించబడుతుందని గమనించాలి. అలాగే డిసెంబర్ 31, 2023 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే రూ.10,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆగస్టు 1, 2023 నుంచి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్, ప్రోత్సాహక పాయింట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డు వినియోగంపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఆగస్టు 12 నుంచి అమల్లోకి వస్తుందని వివరించండి. యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేసే వ్యక్తులు ఈ తేదీ నుంచి షాపింగ్‌పై తక్కువ క్యాష్‌బ్యాక్ పొందనున్నారు.

ఆగస్టు నెలలో ఇతర మార్పులను గమనిస్తే.. SBI అమృత్ కలాష్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ ఆగస్టు 15, 2023. SBI వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఈ పథకంలో 400 రోజుల పాటు పెట్టుబడి పెట్టడానికి, కస్టమర్‌లకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.6 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. స్టేట్ బ్యాంక్ అందిస్తున్న ఈ ప్రత్యేక FD స్కీమ్ అకాల ఉపసంహరణ, డిపాజిట్ ఎంపికపై రుణ సదుపాయాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాగే IDFC బ్యాంక్ అమృత్ మహోత్సవ్ FD 15 ఆగస్టు 2023 వరకు కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 375 రోజుల పెట్టుబడితో కూడిన ఈ ప్రత్యేక ఎఫ్‌డీపై, బ్యాంకు గరిష్టంగా 7.60 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది.


Click it and Unblock the Notifications