Supertech: ప్రజల సొంతింటి కలను ఆసరాగా తీసుకుని వారిని మోసం చేసిన సూపర్‌టెక్ యజమాని ఆర్‌కె అరోరాను ఈడీ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కు పాల్పడిన కేసులో మంగళవారం అరెస్ట్ చేసి మూడు రోజులుగా విచారణ చేస్తోంది.
సూపర్‌టెక్‌కి చెందిన ఆర్‌కె అరోరా నోయిడాలో ట్విన్ టవర్ నిర్మించడం ద్వారా వెలుగులోకి వచ్చారు. దిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో.. సూపర్‌టెక్, ఆర్‌కె అరోరాపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. కొనుగోలుదారుల నుంచి ఫ్లాట్ బుకింగ్ పేరుతో సూపర్‌టెక్ అడ్వాన్స్ డబ్బులు తీసుకుని.. వాటిని చూపి బ్యాంకుల నుంచి భారీగా రుణాలను తీసుకుంది.

తీసుకున్న రుణాలకు చెల్లింపులు చేయకుండా బ్యాంకులకు సూపర్‌టెక్ భారీ నష్టాన్ని కలిగించింది. ప్రజల నుంచి తీసుకున్న సొమ్ముతో ఇతర గ్రూప్ కంపెనీల పేరుతో భూమిని కొనుగోలు చేసి దానిపై బ్యాంకుల నుంచి రుణాలను పొందినట్లు అధికారులు గుర్తించారు. రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో దాదాపు రూ.1,500 కోట్ల మేర బ్యాంకుల వద్ద మెుండి బకాయిలుగా మారాయి. అరోరాకు మెుత్తం 34 కంపెనీలను ఏర్పాటు చేశారు.
రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా.. సివిల్ ఏవియేషన్, కన్సల్టెన్సీ, బ్రోకింగ్, ప్రింటింగ్, ఫిల్మ్స్, హౌసింగ్ ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్ వంటి రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉన్నారు. సామాన్యుడి నుంచి పేరుగాంచిన బిల్డర్‌గా ప్రయాణం 1995 డిసెంబర్ 7న ప్రారంభమైంది. అలా అరోరా వ్యాపారం ఫ్లాట్ నుంచి స్మశాన వాటికల వరకు విస్తరించింది. అనతికాలంలోనే 12 నగరాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రారంభించారు. దిల్లీ, మీరట్, నోయిడా, గ్రేటర్ నోయిడాలో అనేక ప్రాజెక్టులను స్టార్ట్ చేశారు. అయితే తప్పుడు కార్యకలాపాల కారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీ 2022లో దివాలా తీసింది. ఈ కంపెనీకి దాదాపు రూ.432 కోట్ల అప్పు ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని నెలల కిందట నోయిడాలోని సెక్టార్ 93Aలోని ట్విన్ టవర్లను కూల్చివేయడంతో అరోరా పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు రూ.200 కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ కూలిపోవటంతో పెద్ద ఆర్థిక కుదుపు కలిగింది. ట్విన్ టవర్‌లోని 711 ఫ్లాట్ల బుకింగ్ కూడా పూర్తయింది. దీని కోసం తీసుకున్న సొమ్మును 12 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications