Risky Job: ఉద్యోగంలో ప్రమాదం ఏంటి బాస్ అని అంటారా. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగానికి అత్యధిక జీతం ఉంటుందనేది సాధారణ ఊహ. కానీ ప్రమాదకరమైన పని ప్రపంచంలోనే అతి తక్కువ జీతం చెల్లించే ప్రదేశాలు కూడా ఉన్నాయి. దీని వెనుక అక్కడి ప్రజల ఆకలి కేకలు ఉన్నాయి. అందుకే వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారు.

ప్రమాదకరమైన ఉద్యోగం..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఇండోనేషియాలోని అగ్నిపర్వత గనుల్లో పనిచేస్తున్న వారి గురించే. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాల్లో ఒకటి మైనింగ్. ముఖ్యంగా మీరు అగ్నిపర్వత ప్రాంతంలోని గనికి వెళ్లి పని ముగించుకుని ఇంటికి తిరిగి రావటం అనేది హామీ లేని ఉద్యోగం.

తక్కువ జీతం..
ఇండోనేషియాలోని అగ్నిపర్వత గనుల్లోకి వెళ్లి సల్ఫర్‌ను వెలికితీసే ప్రమాదకరమైన పనికి జీతం తక్కువ. ఇందులో ప్రాణాపాయం కూడా చాలా ఎక్కువ. దురదృష్టవశాత్తు చాలా మంది తక్కువ వేతనాలకు అంటే కేవలం 12 డాలర్లకే పనిచేస్తున్నారు. అంటే ఈ మెుత్తం మన భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1000.

అగ్నిపర్వత గని లోపల సల్ఫర్..
అగ్నిపర్వత గనిలోకి వెళ్లి సల్ఫర్ సేకరించే కార్మికులు గని నుంచి సల్ఫర్‌ను తమ శరీర బరువుతోపాటు మోసుకెళ్లటం చాలా కష్టం. అక్కడి కార్మికుల్లో నిర్వహించిన సర్వే ప్రకారం.. ఈ పని చేసే గని కార్మికులు సాధారణంగా 50 ఏళ్లు దాటి జీవించరని తెలుస్తోంది.

200 పౌండ్ల బరువు మోసుకుంటూ..
చాలా మంది మైన్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి గనిలోకి వెళ్లి 200 పౌండ్ల సల్ఫర్‌తో కూడిన రెండు బుట్టలతో బయటకు వచ్చే పనిని చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఈ అగ్నిపర్వత గనిలో వందలాది మంది సల్ఫర్ మైనర్లు పని చేయడం చూడవచ్చు.

పేదరికం.. ఆకలి..
కేవలం వెయ్యి రూపాయలతో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ పని ఎందుకు చేస్తున్నారంటూ ఓ ఉద్యోగి ప్రశ్నించగా.. 'ఆకలి' అని ఒక్క మాటతో అక్కడి గని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదకరమైనప్పటికీ ఈ పని వల్ల కుటుంబానికి తిండి పెట్టగలుగుతున్నట్లు వారు చెబుతున్నారు. గంధకం మోయడం వల్ల భుజం వాచిపోతుందని.. పేదరికాన్ని దూరం చేసేందుకే ఈ పనిని కొనసాగిస్తున్నట్లు వాపోతున్నారు.

పనిలో ఉండగా పొగ..
గనిలో సల్ఫర్ తీసుకుంటుండగా ఒక్కసారిగా పొగలు వస్తే ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీయాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ఆ పొగ పీల్చటం వల్ల పేగుల్లో విపరీతమైన నొప్పి వస్తుందని అక్కడ పనిచేసే కార్మికులు తెలిపారు.

భద్రత కరవు..
గనుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే కార్మికులకు తగిన భద్రతా చర్యలు లేకపోవడం విచారకరం. గనిలో పనులకు వెళ్లే వారికి నీళ్లలో నానబెట్టిన గుడ్డను మాత్రమే ఇస్తారని తెలుస్తోంది. నోటికి గుడ్డ కట్టుకుని ఎలాంటి ఇతర రక్షణ పరికరాలు లేకున్నా గనిలోనికి వెళ్లటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications