Rich Kid: ప్రపంచంలో వీడే బుల్లి కుబేరుడు.. వీడి ఆస్తులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వుద్ది..!
Rich Kid: వీడు పేరుకే బుడ్డోడు కానీ ప్రస్తుతం ప్రపంచంలో చిన్న వయస్సులోనే కుబేరుడిగా నిలిచారు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే మనం జీవితకాలం ప్రయత్నించినా సంపాదించలేనంత కూడబెట్టాడు. కేవలం 6 సంవత్సరాల వయస్సులోనే పెద్ద మ్యాన్షన్ కూడా పొందాడు. చిన్నతనంలోనే ప్రపంచ రికార్డులు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్న చిచ్చర పిడుగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారీగా సంపద..
మనం మాట్లాడుకుంటున్న బుడ్డోడిది నైజీరియా. ఇతని పేరు మహహ్మద్ అవల్ ముస్తఫా. వీడి ప్రస్తుత వయస్సు కేవలం 10 సంవత్సరాలు. ఇంత చిన్న వయస్సులోనే లగ్జరీ కార్లు, ప్రైవేటు విమానం, విశాలమైన అందమైన భవనం ఇతని సొంతం. నైజరియిలో ఈ బుడ్డోడిని మెంఫా జూనియర్ అని పిలుస్తారు.

సోషల్ మీడియా సెలబ్రిటీగా..
ప్రస్తుతం ఈ బాలుడి తండ్రి నైజీరియాలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో మెంఫా పేరుతో ఆయన ప్రొఫైల్ ఉంది. ప్రస్తుతం ఈ ఛానల్ కు దాదాపు 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఆదాయంతో వ్యాపారాలు..
ఇన్ స్టాగ్రామ్ వీడియోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించి వ్యాపారాలు ప్రారంభించి అతను భారీగా సంపాదించాడు. అలా సంపాదించిన దానితో కుమారుడికి లాగోస్ లో అద్బుతమైన భవంతిని గిఫ్ట్ గా అందించాడు. తండ్రి బాటలోనే నడిచిన ఈ బుడ్డోడు.. మోంఫా జూనియర్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో పాపులర్ అయ్యాడు.

కోర్టు కేసు వివాదాలు..
అయితే ప్రస్తుతం ఈ బుల్లి కుబేరుడి తండ్రి మనీలాండరింగ్ కేసుల్లో దర్యాప్తులను ఎదుర్కొంటున్నాడు. ఖరీదైన వాచ్ లు, ఇతర స్థిరచరాస్తుల వివరాలను దాచిపెట్టిన కేసులో నైజీరియా అవినీతి నిరోధక ఏజెన్సీ మోంఫాను వెంటాడుతోంది.


Click it and Unblock the Notifications