Success Story: అస్సలు ఏమీ లేని స్థాయి నుంచి ప్రారంభించి అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వారు అనేక మంది. అలాంటి స్థాయికి చేరుకున్న ఒక ఐఐటియన్ స్ఫూర్తిదాయకమైన జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రికి రాత్రి విజయం రాదనే విషయం అప్పట్లో కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్న చాలా మందిని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది జే చౌదరి గురించి. ఆయన ప్రస్తుతం 2008లో స్థాపించిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ Zscalerకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆయన అమెరికాలో సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్నారు. ఈ కంపెనీలో జే కుటుంబానికి 42 శాతం వాటా ఉంది. 2018లో ఈ కంపెనీ పబ్లిక్ గా లిస్టింగ్ అయ్యింది.

జే చౌదరి 1980లో అమెరికాకు వెళ్లారు. 1996లో జే చౌదరి, ఆయన భార్య జ్యోతి తమ ఉద్యోగాలను విడిచిపెట్టి సంపాదించిన మెుత్తాన్ని పెట్టుబడిగా పెట్టి సెక్యూర్‌ఐటి అనే సంస్థను ప్రారంభించారు. ఇది వారి జీవితంలో మెుదటి స్టార్టప్ కంపెనీ. ఆ తర్వాత వారు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వారి వ్యాపారం మారుతున్న సాంకేతిక అవసరాల కారణంగా విజయవంతంగా ముందుకు సాగుతోంది.
అత్యంత సామాన్యమైన నేపథ్యం నుంచి జే చౌదరి ప్రస్థానం మెుదలైంది. హిమాచల్‌ప్రదేశ్‌లో సరిగా నీటి సౌకర్యం కూడా లేని ఒక చిన్న గ్రామంలో ఆయన నివశించేవారు. కరెంటు కూడా లేని రోజుల్లో చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత అస్సలు మానుకోలేదు. అలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, BHU నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్, సిన్సినాటి విశ్వవిద్యాలయం నుంచి MBA చేశారు.
Zscaler కంటే ముందు చౌదరి SecureIT, CoreHarbor, CipherTrust, AirDefense అనే నాలుగు ఇతర టెక్ కంపెనీలను స్థాపించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో చిన్న గ్రామం నుంచి ఎదిగిన ఆయన నికర విలువ రూ.71,189 కోట్లుగా ఉంది. సొంతంగా కంపెనీలను ప్రారంభించటానికి ముందు NCR, IBM, Unisys, IQ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పలు హోదాల్లో పనిచేశారు.


Click it and Unblock the Notifications