సచిన్, కోహ్లీ, ధోనీ కంటే సంపన్న క్రికెటర్.. యువ భారతీయ క్రికెటర్ ఎవరంటే..??
Aryaman Vikram Birla: భారతదేశంలోని ప్రజలకు క్రికెట్ అంటే ఒకపెద్ద వ్యసనం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ ఆటను ఎంతగానో ఆదరించటమే దీనికి అసలు కారణం. దీంతో దేశంలో చాలా మంది క్రికెటర్లు ఫేమస్ అవ్వటంతో పాటు ధనవంతులుగా సైతం మారిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న యువ క్రికెటర్ పుట్టుకతోనే ధనవంతుడు. అతను సచిన్, కోహ్లీ, ధోనీ కంటే సంపదలో చాలా ఎక్కువ కలిగి ఉన్నాడు. వాస్తవానికి ఈ దిగ్గజ ఆటగాళ్లు మైదానంలో తమదైన ముద్ర వేయడమే కాకుండా యాడ్స్, బిజినెస్, పెట్టుబడుల ద్వారా కెరీర్‌లో భారీ ఆదాయాన్ని సంపాదించారు. అయితే ఆర్యమాన్ విక్రమ్ బిర్లా అనే యువ ఆటగాడు దిగ్గజ ఆటగాళ్ల కంటే ఎక్కువ సంపదను కలిగిఉన్న క్రికెటర్ అని మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ముంబైలో 9 జూలై 1997న జన్మించిన ఆర్యమాన్ విక్రమ్ బిర్లా ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడు. సమాచారం ప్రకారం ఆర్యమాన్ నికర విలువ దాదాపు రూ.70,000 కోట్లుగా అంచనా వేయబడింది. అతను తన కెరీర్ రంజీ ట్రోఫీ 2017-18 సీజన్‌లో మధ్యప్రదేశ్ తరపున ఆడటంతో ప్రారంభించాడు. పైగా 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షలకు ఆర్యమాన్ ను కొనుగోలు చేసింది. అద్భుతమైన క్రికెట్ కెరీర్ ఉన్నప్పటికీ ఆర్యమాన్ వ్యక్తిగత కారణాలతో 2019లో క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు.
దీని తర్వాత ఆర్యమాన్ వ్యాపార ప్రపంచంలో కూడా గొప్ప విజయాన్ని సాధించింది. సోదరి అనన్య బిర్లాతో కలిసి 2023లో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. ఆర్యమాన్ ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని అనేక కంపెనీలలో డైరెక్టర్‌షిప్‌లను కూడా కలిగి ఉన్నాడు. సచిన సంపద విలువ రూ.1,100 కోట్లుగా ఉండగా, కోహ్లీ నికర విలువ రూ.900 కోట్లు, ధోనీ నికర విలువ రూ.800 కోట్లుగా ఉంది. అయితే ఆర్యమాన్ సంపద విలువ ఏకంగా రూ.70,000 కోట్లుగా ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications