Ratan Tata: అందుకే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదంట.. ఆయన ప్రేమ కథ ఇదే..
Ratan Tata: దేశంలోని అగ్రగామి వ్యాపార సంస్థగా ఉన్న టాటా గ్రూప్ ను ముందుండి నడిపించిన వ్యక్తి రతన్ టాటా. చిన్న వయస్సులోనే టాటాల పగ్గాలు చేపట్టిన ఆయన కంపెనీని ఎలా నడపగలరని అనేక మంది మెుదట్లో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ తన పనితీరుతో రతన్ టాటా వాటన్నింటినీ తప్పని నిరూపించారు.
అయితే ఇప్పటికీ ఆయన వివాహం చేసుకోలేదు. నిరంతరం జీవితాన్ని టాటా గ్రూప్ పురోగతికి వెచ్చించిన రతన్ టాటా అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్న ఆయన అభిమానుల్లో ఇప్పటికీ మిగిలిపోయింది. అయితే తన ప్రేమ పెళ్లి గురించి రతన్ టాటా వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జీవితంలో నాలుగు సార్లు తాను ప్రేమలో పడ్డానని రతన్ టాటా వెల్లడించారు. మెుదటగా తాను అమెరికాలో పనిచేస్తున్న సమయంలో సీరియస్ గా ప్రేమలో పడ్డానని రతన్ టాటా తెలిపారు. అప్పట్లో ఇండో చైనా వార్ సమయంలో తాను భారత్ తిరిగి వచ్చానని, తన ప్రియురాలు తనతో వచ్చేందుకు నిరాకరించినట్లు రతన్ టాటా వెల్లడించారు.
మీరెప్పుడైనా పెళ్లి చేసుకోవాలని ఆలోచించారా అంటూ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తన జీవితంలో అనేక మాట్లు పెళ్లికి దగ్గర దాకా వెళ్లానని, అయితే కొన్ని కారణాల వల్ల అనేక సందర్భాల్లో ప్రయత్నాలు నిలిచిపోయాయని రతన్ టాటా పేర్కొన్నారు. వ్యాపారాలకు సంబంధించి బిజీగా ఉండటం.. వ్యక్తిగత జీవతం కంటే వృత్తి జీవితం ముఖ్యమైనవి కావటం వీటిలో ఉన్నాయన్నారు. అయితే పెళ్లి చేసుకోనందుకు ఇప్పుడు బాధపడుతున్నట్లు ఇంటర్వ్యూర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.


Click it and Unblock the Notifications