కన్నుమూసిన Queen Elizabeth II.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా..? ఆమెకు ఆదాయం ఎలా వస్తుదంటే..

Queen Elizabeth II: బ్రిటన్‌ చరిత్రలో దీర్ఘకాలం రాణిగా కొనసాగిన క్వీన్ ఎలిజబెత్- II 96 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆమె దాదాపు 70 ఏళ్లకు పైగా రాణిగా కొనసాగారు. ఆమె మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం సంతాపం తెలిపారు. 1952లో బ్రిటన్ రాజు జార్జ్ VI మరణించిన తర్వాత 25 ఏళ్ల కుమార్తె ఎలిజబెత్ II రాణి అయ్యారు. 1952లో సింహాసనాన్ని అధిష్టించిన క్వీన్ ఎలిజబెత్ తన పదవీకాలంలో 15 మంది ప్రధానమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

బోరిస్ జాన్సన్..

బోరిస్ జాన్సన్..

కొద్ది రోజుల క్రితం గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న బోరిస్ జాన్సన్ ఒక వేడుకలో రాణిని కలిశారు. ఎప్పుడూ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ప్రధానిని కలిసే రాణి ఈసారి పామరెల్ ప్యాలెస్‌లో కలుసుకున్నారు. అప్పుడు ఆమెను బోరిస్ జాన్సన్ నిశితంగా పరిశీలించారు. అకస్మాత్తుగా క్వీన్ అనారోగ్యానికి గురికవటంతో ఆమెకు చికిత్స కొనసాగింది.

అధికారిక ప్రకటన..

అధికారిక ప్రకటన..

చికిత్స పొందుతున్న ఆమెకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించిన తరుణంలో.. మరణవార్త వెలువడింది. దీన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారికంగా ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. రేపు ఆమె మృతదేహాన్ని లండన్‌కు తీసుకువస్తామని ప్రకటించారు.

ఆస్తుల విలువ..?

ఆస్తుల విలువ..?

70 ఏళ్లు రాణిగా కొనసాగిన ఎలిజబెత్ ఆస్తుల విలువ 500 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఆమె మరణంతో ఆస్తులు ఏమవుతాయన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

రాణికి అదాయం ఎలా వస్తుంది?

రాణికి అదాయం ఎలా వస్తుంది?

బ్రిటన్ పన్ను చెల్లింపుదారుల నుంచి రాణి సావరిన్ గ్రాంట్ అని పిలువబడే ఆదాయాన్ని పొందుతుంది. ఇది ఏటా బ్రిటిష్ రాజకుటుంబానికి చెల్లించబడుతుంది. అయితే.. నేడు ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా పరిగణించబడుతున్న రాణికి ఇది ఏకైక ఆదాయ వనరు కాదు.

గ్రాంట్స్ ద్వారా ఆదాయం..

గ్రాంట్స్ ద్వారా ఆదాయం..

2021-2022 మధ్య కాలంలో క్వీన్ ఎలిజబెత్ 86 మిలియన్ యూరోల గ్రాంట్‌లను అందుకున్నారు. ఇందులో బిజినెస్ ట్రావెల్, ఆస్తి నిర్వహణ, ఆపరేషన్, ఇతర నిర్వహణ ఖర్చులు మొదలైనవి ఉంటాయి. అయితే.. రాణికి ఇదొక్కటే ఆదాయ వనరు కాదు.

రాయల్ కంపెనీ..

రాయల్ కంపెనీ..

మోనార్కీ పీఎల్‌సీ అనే కంపెనీ క్వీన్ కుటుంబం నడుపుతున్న వ్యాపార సామ్రాజ్యం. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2021 నాటికి ఇది దాదాపు 28 బిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ ఆస్తులను కలిగి ఉంది. వీటిని అమ్మరని తెలుస్తోంది. ఇందులో క్రౌన్ ఎస్టేట్ - 19.5 బిలియన్ డాలర్లు, పాకిమ్‌హాంగ్ ప్యాలెస్ - 4.9 బిలియన్ డాలర్లు, డచీ ఆఫ్ కార్న్‌వాల్ - 1.3 బిలియన్ డాలర్లు, డచీ ఆఫ్ లాంకాస్టర్ - 748 మిలియన్ డాలర్లు, కెన్సింగ్టన్ ప్యాలెస్ - 630 మిలియన్లు డాలర్లు, క్రౌన్ ఎస్టేట్ ఆఫ్ స్కాట్లాండ్ - 592 మిలియన్ డాలర్లు. వీటి ద్వారా రాజకుటుంబం వాణిజ్యపరంగా లాభపడనప్పటికీ, ఆర్థిక వ్యవస్థను పెంచడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాణి వ్యక్తిగత ఆస్తులు..

రాణి వ్యక్తిగత ఆస్తులు..

క్వీన్ ఎలిజబెత్ ఖరీదైన పెయింటింగ్స్, నగలు, రియల్ ఎస్టేట్ ఆస్తులతో పాటు అనేక ఇతర పెట్టుబడులను కూడా కలిగి ఉన్నారు. ఈ ఆస్తిలో ఎక్కువ భాగం ప్రిన్స్ చార్లెస్ సింహాసనాన్ని అధిరోహించినప్పుడు ఇవ్వబడతాయి. UK చట్టాల ప్రకారం ఈ ఆస్తులకు కూడా పన్ను మినహాయింపు ఉండవచ్చని భావిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+